బిగ్బాస్ విన్నర్ పై కేసు నమోదు.. కరోనా వచ్చినా షూటింగ్లో పాల్గొనడంపై పోలీసుల ఆగ్రహం..
కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. గత కొద్ది రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన కేసులు... తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి.
కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. గత కొద్ది రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన కేసులు… తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. ఇక ఈ మహామ్మారి సినీ ఇండస్ట్రీపై భారీగానే ప్రభావం చూపించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోవిడ్ భారీన పడ్డారు. కానీ ఈ వైరస్ గురించి అటు ప్రభుత్వం ఎన్ని సార్లు హెచ్చరించినా.. కొందరు మాత్రం ఇందుకు బిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం క్యారంటైన్ లో 14 రోజులు ఉండాలని అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాలు హెచ్చరిస్తూన్న ఏమాత్రం లేక్కచేయడం లేదు. పాజిటివ్ వచ్చిన విషయం తెలుసుకున్న బయటకు వచ్చి సామాన్య ప్రజలలో తిరిగేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇదే చేసింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా కూడా సినిమా చిత్రీకరణలో పాల్గోంది.. దీంతో తనతో పాటు అక్కడున్న వాళ్లందరినీ ప్రమాదంలో పడేసింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ప్రభుత్వ నియమాల ప్రకారం కరోనా వచ్చిన వ్యక్తులు దాదాపు 14 రోజుల పాటు బయటకు రాకుడదు. హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలి. పూర్తిగా కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే బయటకు రావాల్సి ఉంటుంది. కానీ హిందీ బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్ కరోనా పాజిటివ్ వచ్చినా కానీ.. షూటింగ్ లో పాల్గోంది. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కరోనా వచ్చినా… డాక్టర్ల సూచనలను పట్టించుకోకుండా.. సినిమా షూటింగ్ లో పాల్గొందని బీఎంసీ అధికారి తెలిపారు. దాంతో ఈమెపై జీఎంసీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అధికారులు. అలాగే దీనిపై పౌరసంఘం కూడా ట్వీట్ చేసింది. కోవిడ్ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. అన్ని మార్గదర్శకాలను అనుసరించాలని.. నగర భద్రత కోసం ఎక్కడా రాజీ పడేది లేదు అంటూ చెప్పుకోచ్చారు. గౌహర్ ఖాన్ కోసం పోలీసులు వెతుకున్నారు. తొందర్లోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: