డైలాగ్ కింగ్ స్పీచ్‏లో ఆసక్తికర పరిణామం.. ఒక్కసారిగా లైట్స్ ఆఫ్.. స్టేజ్ పైనే అసహనం వ్యక్తం చేసిన మోహన్ బాబు.

mosagallu movie pre release event: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా.. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర 'మోసగాళ్లు'

డైలాగ్ కింగ్ స్పీచ్‏లో ఆసక్తికర పరిణామం.. ఒక్కసారిగా లైట్స్ ఆఫ్.. స్టేజ్ పైనే అసహనం వ్యక్తం చేసిన మోహన్ బాబు.
Mohan Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2021 | 6:42 AM

mosagallu movie pre release event: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా.. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర ‘మోసగాళ్లు’. డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, రానా దగ్గుపాటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అలాగే హీరో మంచు విష్ణు, నవదీప్, సునీల్, కాజల్, రాజా రవీంద్ర ఇతర నటీనటులు హజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఈ ప్రీరిలీజ్ వేడుకలో మోసగాళ్లు సినిమా గురించి డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన కొడుకు విష్ణుపై ప్రశంసలు కురిపించాడు. ఏ తండ్రీ బిడ్డను సభలో పొగడకూడదని శాస్త్రం చెప్తుంది.. రహస్యంగా పొగడాలంటూ చెప్పుకోచ్చారు. తన కొడుకు మంచి నటుడని.. ఈ సినిమాలో విష్ణు ఫెర్మామెన్స్ అద్భుతం అని.. విష్ణు బాగా చేస్తాడు కనుకునే ఇంతమంచి నటుడు అయ్యాడంటూ చెప్పారు. అలాగే విష్ణు వండర్ ఫుల్ ఆర్టిస్ట్ అంటూ చెప్తుండగానే.. ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. దీంతో స్టేజ్ మొత్తం చీకటి కమ్మేసింది. దీంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేస్తూ.. లైట్స్ ఆఫ్ చేశారేంటయ్యా అంటూ తన స్పీచ్‏ను కొనసాగించారు. సైన్స్ ఫిక్షన్ క్రైం థ్రిల్లర్ కథతో మంచు విష్ణు హీరోగా నిర్మాతగా చేసి మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో విష్ణు అక్కగా కాజల్ నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ పాత్రలో నటించాడు.

Also Read:

RRR Movie: జక్కన్న క్రియేటివిటి.. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీత.. అదిరిపోయిన అలియా లుక్..

మెగా ఫోన్ పట్టనున్న స్టార్ కమెడియన్.. సరికొత్త ప్రయోగానికి తెరలెపిన ప్రియదర్శి..

‘బుట్టబొమ్మ’ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగదరియా’..