Karthika Deepam : మనమిద్దరం మనకు ఇద్దరు అంటున్న మోనిత…. దీప జాడను చెప్పే సరికొత్త క్యారెక్టర్ సంతానం ఎంట్రీ

బుల్లి తెరపై సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం ఈరోజు 988వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈరోజు ఒక కొత్త క్యారెక్టర్ సంతానం సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కార్తీక దీపం సీరియల్ మరింత ఉత్కంఠంగా...

Karthika Deepam : మనమిద్దరం మనకు ఇద్దరు అంటున్న మోనిత.... దీప జాడను చెప్పే సరికొత్త క్యారెక్టర్ సంతానం ఎంట్రీ
Karthika Deepam
Follow us

|

Updated on: Mar 16, 2021 | 10:50 AM

Karthika Deepam Serial : బుల్లి తెరపై సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం ఈరోజు 988వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈరోజు ఒక కొత్త క్యారెక్టర్ సంతానం సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కార్తీక దీపం సీరియల్ మరింత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు.. ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!

దీప టిఫిన్ సెంటర్ ముందు పిల్లలతో కూర్చుకుని ఉంటె.. ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ వచ్చిన కారు లోనుంచి దిగేది నాన్న ఏమో అని ఆశాగా చూస్తుంది హిమ.. అయితే ఆ కారులో ఉంచి ఒక మహిళ దిగి టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. ఇది చూసి శౌర్య, వారణాసి నవ్వుకుంటారు. ఎందుకు అని హిమ ప్రశ్నిస్తే.. ఆమె వారణాసికి తెలుసుకున్న ఆమె.. ఒక కారు కనుక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగితే.. మరింత మంది వస్తారు చూడు అంటుంది శౌర్య.. ఆ మాటను నిజం చేస్తూ.. అటుగా వెళ్లే ఒక కారు నుంచి కొంతమంది దిగి.. కారు లో వచ్చి ఇక్కడ టిఫిన్ తింటున్నారు అంటే టిఫిన్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటూ.. మరికొందరు వచ్చి.. దీపకు టిఫిన్ ఆర్డర్ చెబుతారు. కొబ్బరి చట్నీ బాగుంది అంటూ తింటారు..

దీప డబ్బులు లెక్కపెడుతూ.. అత్తమ్మ నీ బుర్రేబుర్ర అంటూ పొగుడుతుంటే.. శౌర్య అడ్డుపడి.. నన్ను అత్తమ్మ అని పిలవద్దు అన్నానా.. మీ అత్తమ్మకె కనుక బుర్ర ఉంటె.. ఇప్పటికి ఎప్పుడో మనందరినీ కలుపును అంటుంది.  ఇంతలో కార్తీక్ మోనిత దగ్గర కూర్చుకుని పిల్లలు గుర్తుకొస్తున్నారు.. హిమ తో పాటు శౌర్యని కూడా తెచ్చుకుందాం అంటాడు. తను దీపని కనిపెట్టడానికి ఎం చేసిందో లిస్ట్ చెబుతుంది కార్తీక్ కు.,. తనకు తెలిసిన అందరి డాక్టర్లకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు దీప ఫోటో ఇచ్చానని.. ఎక్కడున్నా వారి జాడాతెలుస్తుందని చెబుతుంది. అప్పుడు కార్తీక్ రౌడీకి వెళ్ళటప్పడికి జలుబు.. ఇప్పుడు ఎలా ఉందొ.. దీప వాళ్ళు దొరికితే హిమతో పాటు శౌర్యని కూడా తెచ్చుకుందాం అంటాడు. దీంతో మౌనిత దీప ని తప్ప ఎవరిని తెచ్చుకున్నా నాకు ఒకే.. మనం ఇద్దరం మనకిద్దరూ అంటూ నవ్వుతుంది.. అదే సమయానికి సౌందర్య ఎంటర్ అవుతుంది.

మోనితనుద్దేసింది నవ్వడం పూర్తి అయితే లోపలి వస్తాను అంటుంది సౌందర్య. డిస్టబ్ చేసినట్లున్నాను అంటుంటే కార్తీక్ కలుగజేసుకుని అదేం లేదు మమ్మీ.. హిమనీ మోనిత కనిపెడితే.. మమ్మల్ని చూడడడానికి అప్పటి నుంచి నువ్వే ఇక్కడికి రావాలి కదా అంటాడు. దీంతో మోనిత చాలా సంతోషంగా చూస్తుంది. నేను మోనితతో మాట్లాడాలి… నువ్వు హాస్పటల్ కి వేళ్ళు అంటుంది కార్తీక్ తో .. అయితే మోనిత భయపడుతున్నట్లు నటిస్తూ.. కార్తీక్ ని మరింతగా అతుక్కుపోతుంది. అప్పుడు నటించింది చాలు.. కార్తీక్ నువ్వు భయపడకు.. నేను మోనితతో మాట్లాడతా.. కొట్టాను అంటూ హామీ ఇస్తుంది . ఎం మాట్లాడాలి నా ముందే మాట్లాడు అని కార్తీక్ అంటే.. సౌందర్య నేను మోనితతో మాట్లాడిన తర్వాత ఫోన్ కాల్ నీకు వెంటనే వస్తుందిగా కంగారు పడకుండా నువ్వు హాస్పటల్ కి వెళ్ళు అంటుంది. దీంతో కార్తీక్ అక్కడనుంచి వెళుతూ.. నేను దైర్యంగా ఇక్కడే ఉంటా అని అన్నా హిమ గురించి చెప్పడం లేదు అని అనుకుంటాడు.. అంతేకాని నిజంగా అమ్మకి దీప అడ్రస్ తెలియదేమో అని ఆలోచించడు..

కార్తీక్ ఇంటి నుంచి అడుగు బయట పెట్టగానే మోనిత తన నిజస్వరూపం బయటపెడుతుంది.. కాళ్లబేరానికి వచ్చారా.. లేక రాయబారానికి వచ్చారా అంటూసౌందర్యాన్ని ప్రశ్నిస్తుంది.. నేను వసుదేవుడిని కాదు.. నువ్వు గాడిదవి కాదు అయినా కార్తీక్ వీక్నెస్ ను అడ్డుగా పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నావు.. అది ఈ జన్మకు జరగదు.. అసలు నీకొక ఈ జన్మలో పెళ్లి కాదు అంటుంది సౌందర్య..

దీంతో మోనిత అత్తగారు నడిచి వచ్చే సిరి ని వద్దని దారిద్రానికి హారతి ఇస్తానంటున్నావు అంటుంది. నిజానికి నిన్నను కొట్టాలని ఉంది.. అయితే నా కొడుక్కి మాట ఇచ్చాను కనుక నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నా.. అసలే మాది ఇచ్చిన మాట మీద నిలబడే వంశం అంటుంది. ఆడది అంటే నా కోడలు దీప లా ఉండాలి.. మూర్తీభవించిన సౌజన్యం, ఆత్మాభిమానం.. .. నీలో ఆ లక్షణాలు అణువంత లేవు.. అసలు నువ్వు ఆడదానివే కావు అంటుంది. ఇంటిలో ప్రియమణి రావడంతో.. కాఫీలు అవి వద్దు.. కొంచెం మంచినీరు ఇవ్వుచాలు అని చెప్పి .. మోనిత సౌందర్య ని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది.

ఇంతలో ఇడ్లీ బండి దగ్గర దీప పిల్లతో కలిసి వారణాసి ఉంటారు.. అటుగా ఓ మహిళ వెళ్తూ.. పిల్లల్ని చూసి దగ్గరకు వచ్చి ఎంత ముద్దొస్తున్నారో అంటూ దీపని ఎంత అదృష్టవంతురాలివి.. రత్నలాంటి పిల్లలు. కొత్తగా వచ్చారా ఏ ఊరు మీది అని అడుగుతుంది. దీప బతుకుతెరువు కోసం తిరిగేవాళ్ళం… మాకు ఒక ఊరు అని ఎం ఉండదు లే అమ్మా అంటుంది.. దీంతో శౌర్య ని ముద్దుగా చూస్తూ అమ్మా అని అనవద్దు నాకు బాధ అనిపిస్తుంది.. పెళ్లి అయి ఇన్నాళ్లు అయినా ఇప్పటికీ పిల్లలు పుట్టలేదు.. డాక్టర్లు చేతులెత్తేశారు.. ఇక దేవుడిమీద భారం వేసి తిరగని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు అంటుంది.. శౌర్యని ముద్దు చేస్తూ.. నీ పేరు ఏమిటి అంటుంది.. రౌడీ మానాన్న అలాగే పిలుస్తాడు నన్ను అంటుంది. హిమ కూడా నా పేరు బంగారం మా నాన్న అలాగే పిలుస్తాడు అంటుంది. నాన్న నాన్నా అంటున్నారు.. ఇంతకీ మీ నాన్నా ఎక్కడ టిఫిన్ సెంటర్ కు కూడా అదే పేరు పెట్టారు అని ప్రశ్నిస్తుంది సంతానం.

దీప షాక్ తింటే.. అంటే రేపు ఇదే ప్రశ్న ఎవరైనా వేస్తె ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించిన సంతానం.. వస్తాను.. నాకు ఈరోజు గైనకాలజిస్టు తో వీడియో అపాయింట్మెంట్ ఉంది అని అంటుంది. ఇప్పుడు నాన్న టిఫిన్ సెంటర్ పేరు ఉంచాలా లేదా అని పిల్లలు ఆలోచిస్తుంటే.. మరోవైపు సరికొత్తగా సంతానం క్యారెక్టర్ తో అదీ పిల్లలు లేని పాత్రని ప్రవేశ పెట్టి… మరింత ట్విస్ట్ ఇచ్చారు.. మరి సంతానం వీడియో కాల్ లో మాట్లాడే డాక్టర్ మోనిత ఐతే .. అపుడు కథ మంచి రసకందాయంలో పడినట్లే.. చూడాలి మరి రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో.. !

Aslo Read:

నువ్వా ? నేనా ? ఫైట్ కి జడిసిందా ? తోక ముడిచిందా ? కర్నాటకలో పైథాన్ ని చూసి పులి ఏం చేసిందో చూడాల్సిందే !

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..