Zomato Issue: షాకింగ్ ట్విస్ట్.. డెలివరీ బాయ్‌పైనే యువతి చెప్పుతో దాడి.. కేసు నమోదు
Zomato Delivery Man: కథ అడ్డం తిరిగింది.. తనను జొమాటో డెలివరీ బాయ్ కొట్టాడంటూ ఓ యువతి వారం నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో
Zomato Delivery Man: కథ అడ్డం తిరిగింది.. తనను జొమాటో డెలివరీ బాయ్ కొట్టాడంటూ ఓ యువతి వారం నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వాడీవేడిగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి జోమాటో బాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆ యువతిపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనను కొట్టాడని మోడల్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హితేషా చంద్రానీ గత బుధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి హితేషా చంద్రానీపైనే కర్ణాటక బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులో జోమాటో ఉద్యోగి కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హితేషా చంద్రానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆమెపై సెక్షన్ 355 (దాడి), 504 (అవమానం), 506 (క్రిమినల్ చర్య) కింద కేసులు నమోదు చేసినట్లు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెల్లడించారు. ముందుగా డెలివరీ బాయ్‌ను విచారించిన పోలీసులు పలు వివరాలను సేకరించి ఈ కేసు నమోదు చేశారు.
అయితే.. చంద్రానీ మీద దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జొమాటో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆ ఆరోపణలను తిరస్కరించాడు. ముందు ఆమె తనను చెప్పుతో కొట్టడం ప్రారంభించిందని వెల్లడించాడు. ఈ సమయంలో తన ఎడమ చేయి ఆమె కుడి చేతిని తాకిందని.. ఆమె ధరించిన ఉంగరమే ఆమె ముక్కుకు తగిలిందని తెలిపాడు. దీంతో రక్తస్రావమైందని వివరించాడు. తాను కావాలని దాడి చేయలేదని.. రెండేళ్లుగా జోమాటోలో పని చేస్తున్నానని.. తాను తప్పుచేయలేదంటూ మీడియా సంస్థతో వెల్లడించాడు.
అయితే.. హితేషా చంద్రానీ అనే బెంగళూరు మహిళ తనపై జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాడి చేశాడని ఆరోపించారు. డెలివరీ ఆలస్యం కావడంతో అడిగినందుకే జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనపై దాడి చేశాడని మార్చి 9న సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో అన్ని ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయ్యింది.
Also Read: