దేశద్రోహం కేసులు ఇండియాకు కొత్త కాదు, లోక్ సభలో హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడి
దేశద్రోహం కేసులు ఇండియాకు కొత్త కాదని హోం శాఖ సహాయ మంత్రి.జి.కిషన్ రెడ్డి తెలిపారు. పైగా ఎన్డీయే ప్రభుత్వానికి కూడా ఇవి కొత్తేమీ కాదు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి...
దేశద్రోహం కేసులు ఇండియాకు కొత్త కాదని హోం శాఖ సహాయ మంత్రి.జి.కిషన్ రెడ్డి తెలిపారు. పైగా ఎన్డీయే ప్రభుత్వానికి కూడా ఇవి కొత్తేమీ కాదు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి మరిన్ని కేసులు నమోదయ్యాయి ని ఆయన చెప్పారు. మంగళవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. బీజేపీ పాలనలో ఈ కేసులు పెరిగాయంటూ మీడియా గోరంతలు, కొండంతలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అటు-భావ ప్రకటన స్వేఛ్చను అణగదొక్కేందుకు దేశద్రోహం కేసులను ప్రభుత్వం వినియోగించుకుంటోందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. 124 (ఏ) సెక్షన్ ను ఈ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ దిశారవి కేసే అన్నారు. ఆమెపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలనూ చూపలేకపోయారని మనీష్ తివారీ పేర్కొన్నారు. ఇటీవల టూల్ కిట్ కేసులో తనకు కలిగిన అనుభవాలను దిశారవి ట్వీట్ చేసింది. తన తప్పు ఏమీ లేకపోయినా పోలీసులు తనను అరెస్టు చేయడం, తాను 3 రోజులు జైల్లో గడపడం, చివరకు కోర్టు తనను నిర్దోషురాలిగా విడుదల చేయడం అన్నీ ఆమె వివరించింది. అన్ని రోజులూ తాను అనుభవించిన మానసిక క్షోభను ఆమె ప్రస్తావించింది. తివారీ తన ప్రసంగంలో దాదాపు ఇవే అంశాలను ప్రస్తావించారు. దిశారవిపై దేశద్రోహం కేసును మోపారన్నారు. చివరకు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఇక దేశంలో పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలపై చర్చించేందుకు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాయిదా తీర్మానాన్ని సమర్పించారు. ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి విషయంలో మన ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిన కేటాయింపుల నుంచి నిధులను వెచ్చించడం లేదని, ప్రభుత్వ కమిటీలు, ఉన్నత స్థాయి నిపుణులు ఈ వ్యవహారాలను చూస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కాగా- మెడికల్ టర్మినేషన్ అఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లును, నేషనల్ కమిషన్ ఫర్ అల్లీడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్లును రాజ్యసభ చర్చకు చేపట్టనుంది. మరిన్ని చదవండి ఇక్కడ : సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video కార్తికేయ వర్సెస్ లావణ్య : చావు కబురు చల్లగా టీం ఆడిన క్రికెట్ మ్యాచ్ లో గెలుపెవరిది ?:Chaavu Kaburu Challaga Team Cricket Match Video