Acharya Movie : వెన్నెల కిషోర్ తో కలిసి నవ్వులు పూయించనున్న మెగాస్టార్.. ఆచార్యలో కామెడీ ట్రాక్ అదిరిపోతుందట..
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ను చకచక పూర్తి చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ , అలాగే తమిళ సూపర్ హిట్ ‘వేదాళమ్’సినిమాను రీమేక్ చేస్తున్నాడు. అయితే ‘సైరా’ సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడం పైగా కొరటాల శివలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ దర్శకత్వం వహించనుండటంతో ఆచార్య సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చరణ్ ఆచార్య షూటింగ్ లోనూ పాల్గొన్నాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్ కాస్త గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసాడు. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తోపాటు కామెడీ ట్రాక్ కూడా హైలెట్ గా నిలవనుందట. ఆచార్య సినిమా లో టాప్న్ కమెడియన్ వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నాడట. వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు కిషోర్. ఇక చాలా సినిమాల్లో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇప్పుడు ఆచార్య సినిమాలోనూ కిషోర్ నవ్వుల వెన్నెల కురిపించనున్నాడని తెలుస్తుంది. ఆచార్య సినిమా కోసం శ్రీధర్ రాసిన కామెడీ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ముఖ్యంగా చిరంజీవి – వెన్నెల కిషోర్ ల కాంబో సీన్స్ ఆడియన్స్ ను తెగ నవ్విస్తాయని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి : Mahesh Babu and Sandeep Vanga : మహేష్ బాబు ను డైరెక్ట్ చేయనున్న అర్జున్ రెడ్డి దర్శకుడు..
Top 5 TV Shows: టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోతున్న సీరియళ్లు.. టాప్ ప్లేస్లో ఉన్నవి ఇవే..
17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే..