Credit Card : ఓ మై గాడ్.. క్రెడిట్ కార్డు వాడకం.. కొకైన్‌కి బానిసవ్వడం ఒక్కటేనట.. షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న..
Credit Card Purchases : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే కొకైన్‌కి బానిసైన మత్తులో ఉన్నారన్నమాట.. అవునండి ఇది నిజం. తాజాగా
Credit Card Purchases : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే కొకైన్‌కి బానిసైన మత్తులో ఉన్నారన్నమాట.. అవునండి ఇది నిజం. తాజాగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. అయితే క్రెడిట్ కార్డుతోలాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వాటి గురించి తెలుసుకుందాం..
కరోనా పుణ్యమా అని డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో ఉద్యోగులు క్రెడిట్ కార్డులు అధికంగా వినియోగిస్తున్నారు. వీటికి తోడు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు విపరీతంగా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. క్రెడిట్ కార్డు వాడుతున్నావారు కూడా అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ఆ మత్తులో పడిపోతే తొందరగా బయటికి రాలేరని అంటున్నారు.
ఎంఐటి నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.. సాధారణంగా క్రెడిట్ కార్డు వాడేవారు నగదు లావాదేవీలు కాకుండా కార్డు లావాదేవీలు చేసేటప్పుడు ఎక్కువగా ఖర్చు చేస్తారని తేలింది. తద్వారా అవసరానికి మించి ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు కూడా కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్‌ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని చెబుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే క్రెడిట్‌కార్డు వాడకం మెదడుకు కొకైన్ మాదిరిగానే కిక్ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డు వాడటం వల్ల బ్యాంకులు, పలు యాప్‌లు రివార్డ్ ప్రకటిస్తుంటాయి. కొంతమంది వీటికి అట్రాక్ట్ అయి కూడా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ప్రొఫెసర్ డ్రేజెన్ ప్రిలెక్ మాట్లాడుతూ.. కొంతమంది క్రెడిట్‌కార్డు, మరికొంతమంది నగదు లావాదేవీలు చేసే వారి మెదడు ప్రతిస్పందనలను తాము స్కాన్ చేశామన్నారు. ఇందులో క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించబడుతున్నట్లు కనుగొన్నారు. ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని వివరించారు.