Employers Provident Fund : UAN నెంబర్ తెలియక పోయినా మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే..!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పై పన్ను మినహాయింపునిస్తూ... ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా CBT ప్రకటన వెలువరించింది. ఈ టాక్స్ బెనిఫిట్స్ తో పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపిక కానుంది...
Employers Provident Fund : ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పై పన్ను మినహాయింపునిస్తూ… ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా CBT ప్రకటన వెలువరించింది. ఈ టాక్స్ బెనిఫిట్స్ తో పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపిక కానుంది.. మరియు కస్టమర్స్ కు సామజిక భద్రతనిస్తుందని భావిస్తుంది.
అయితే పిఎఫ్ చందారులు తమ EPF ఖాతా బ్యాలెన్స్‌ను నాలుగు రకాలుగా తనిఖీ చేయవచ్చు . ఆన్ లైన్ , UMANG App, ఎమ్మెఎస్, మరియు మిస్డ్ కాల్ ద్వారా పిఎఫ్ చందారులు తమ ఖాతా బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే UAN పోర్టల్‌లో నమోదు చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల నుండి 7738299899 కు SMS ‘EPFOHO UAN’ కు SMS పంపడం ద్వారా వారి PF వివరాలను పొందవచ్చు. UAN లో నమోదు చేసుకున్న వారి మొబైల్ నంబర్ నుండి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFO చందాదారులు వారి పీఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు.
అయితే పీఎఫ్ ఖాతాదారులకు తమ UAN తెలియకపోతే.. అప్పుడు కూడా EPF ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. UAN లేకుండా ఆన్‌లైన్‌లో EPF ఖాతా బ్యాలెన్స్ ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ ను ఓపెన్ చేయాలి ఇప్పుడు “మీ పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి లింక్ మీద క్లిక్ చేయండి.. అప్పుడు EPFO లింక్ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు epfoservices.in.epfo కి వెళుతుంది. అనంతరం మీ రాష్ట్రాన్ని నమోదు చేయండి. ఇపిఎఫ్ ఆఫీస్ పేరు నమోదు చేయండి. తర్వాత మీ కోడ్‌ను నమోదు చేయండి. అనంతరం మీ పిఎఫ్ ఖాతా నంబర్, పేరు మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి. అనంతరం ఓపెన్ చేయడానికి అంగీస్తున్నాను ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు మీ పిఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.
మార్చి 4, 2021 న పిఎఫ్ చందాదారుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను 8.5 శాతం వార్షిక వడ్డీ రేటును ప్రకటించింది. ఈ మేరకు ఐదు కోట్లకు పైగా క్రియాశీల చందాదారుల కు మేలు చేకూరనుంది.