AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food of The Future : అక్కడ స్టార్ హోటల్స్ లో ‘పురుగులు’ ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ..పెరుగుతున్న జనాభాకు ఇవి తినడం తప్పదట

మాంసాహారం తినే వారు కూడా తాము తినే ఆహార పదార్ధాల్లో పురుగులు వచ్చినా.. బొద్దింకలు వచ్చినా తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనిపై అనేక సినిమాల్లో నవ్వు తెప్పించే విధంగా కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హోటల్ లో..

Food of The Future : అక్కడ స్టార్ హోటల్స్ లో 'పురుగులు' ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ..పెరుగుతున్న జనాభాకు ఇవి తినడం తప్పదట
Thailand Restaurant
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 6:11 PM

Share

Food of The Future : మాంసాహారం తినే వారు కూడా తాము తినే ఆహార పదార్ధాల్లో పురుగులు వచ్చినా.. బొద్దింకలు వచ్చినా తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనిపై అనేక సినిమాల్లో నవ్వు తెప్పించే విధంగా కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హోటల్ లో తాము తిన్నదానికి బిల్ కట్టడానికి డబ్బులు లేకపోతే.. ఆ ప్లేట్లో బొద్దింకలు వేసి.. నానా హంగామా చేసి బిల్ ఎగ్గొట్టే సన్నివేశాలు అనేకం.. కాగా గత కొంత కాలంగా ప్లేట్లో పురుగులు వంటకాలు చేసే స్టార్ హోటల్స్ ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ఏర్పడుతున్నాయి. ఆ పురుగులను ఎంతో ఇష్టంగా తింటూ తమ ఫుడ్ మెనూలో ఓ ప్రధాన వంటకంగా చేర్చేశారు కూడా..

చైనా, థాయిలాండ్ వంటి కొని దేశాలతో పాటు మనదేశంలోకి ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని తెగల్లో పురుగులను ఆహారంగా తీసుకుంటారు.అయితే ఏ దేశంలోనూ ఈ పురుగులు రెస్టారెంట్ మెనూగా చేరలేదు. ఇక థాయిలాండ్ లో కొన్ని చోట్ల పురుగులను ముఖ్యంగా నీటి లో ఉండే పురుగులను తినడం ఎప్పటినుంచో ఉంది. గత కొంతకాలంగా పెద్ద పెద్ద రెస్టారెంట్ లో పురుగులను సర్వ్ చేయడానికి పరుగులు మొదలు పెట్టారు.. ఎందుకంటే ఈ పురుగుల్లో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు సమృధ్ధిగా ఉండడమే కారణం అట.. అందుకనే ఇప్పటికే థాయ్ రెస్టారెంట్లో సర్వ్ చేసే పురుగుల మెనూ ని జనం చాలా ఇష్టం ఫోర్క్ కి గుచ్చుకొని మరీ తింటున్నారు. పంటి కింద పెట్టి కరకరలాడిస్తున్నారు.

ఈ విషయం పై థాయ్ కి చెందిన ఓ స్టార్ చెఫ్ మాట్లాడుతూ… “రాబోయే వందేళ్లలో మానవజాతికి కావలసినంత పోటీన్లు ప్రస్తుతం ఉన్న ఆహార పదార్ధాలు అందివ్వలేవు.. దీంతో మనిషి ప్రత్యామ్నాయ ఆహారం వైపు దృష్టి సారిస్తాడు.. అప్పుడు తినదగ్గ పురుగులను ఎంచుకొంటాడు అని వ్యాఖ్యానించాడు.. అంతేకాదు.. సముద్ర నాచుతో కూడిన వంటకాలను కూడా స్టార్ హోటల్స్ వారు చేయాలసిన పరిస్తితి ముందు ముందు ఏర్పడుతుందని భవిష్యత్ పై జోస్యం చెప్పాడు.. కాగా జపాన్ వంటి దేశాల్లో సముద్రంలో లభ్యమయ్యే నాచు తో సూప్ వంటి పదార్ధాన్ని చేసుకొని ఎక్కువగా తాగుతారు..

ఇక మన దేశంలో చత్తీస్ గడ్ వంటి ప్రాంతాల్లో కొన్ని రకాల చీమలను, ముడతలను తింటారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్ధాల ఉత్పత్తి పెరగక పోయినా… కొత్త రకాల ఆహార ఉత్పత్తులను మనిషి కనిపెట్టలేక పోయినా మనిషి తినడానికి వీలయ్యే జీవరాశులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది తోసి పుచ్చలేని అంశం.

Also Read: enefits Of Tamarind Leaves : సీజనల్ సమయంలో లభించే చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

నెల్లూరు నుంచి నరసాపురం వెళ్లోన్న స్విఫ్ట్ కారు, డిక్కీ చెక్ చేసిన పోలీసులు.. అయ్యబాబోయ్‌.. డబ్బే డబ్బు.!