AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని అన్ని దేశాలూ వినియోగించవచ్చు, హానికరం కాదన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ప్రపంచంలో అన్ని దేశాలూ వినియోగించవచ్చునని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇది హానికరం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని అన్ని దేశాలూ వినియోగించవచ్చు, హానికరం కాదన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Boris Johnson
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 16, 2021 | 5:35 PM

Share

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ప్రపంచంలో అన్ని దేశాలూ వినియోగించవచ్చునని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇది హానికరం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ టీకా మందు ను  తమ దేశం సహా ఇండియా, అమెరికా, ఇతర దేశాలు వాడుతున్నాయని, అందువల్ల దీనిపై సందేహాలు అనవసరమని ఆయన చెప్పారు.  పలు యూరప్ దేశాలు ఈ వ్యాక్సిన్  వినియోగాన్ని బ్యాన్ చేసిన సంగతి విదితమే.  ఇది తీసుకున్న రోగుల్లో పలువురికి బ్లడ్ క్లాట్ (రక్తం గడ్డ కట్టిన) అయినట్టు వార్తలు రావడంతో  జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, డెన్మార్క్ తదితర దేశాలు దీన్ని నిషేధించాయి. అయితే ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరప్ మెడిసిన్స్ ఏజన్సీ ఇది సురక్షితమైనదని పదేపదే పేర్కొన్నాయి. బోరిస్ జాన్సన్ ఇదే విషయాన్నీ గుర్తు చేస్తూ..  ఇది ఎంతో నాణ్యమైనదని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎంతో బాగా పని చేస్తుందని’టైమ్స్’ వార్తా పత్రికలో ఓ ఆర్టికల్ రాశారు. ‘ ఈ  టీకామందును ఇండియాలోనూ, అమెరికా లోను , మా దేశంలో కూడా తయారు చేస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా దీన్ని వాడుతున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు.

ప్రపంచంలోని రెగ్యులేటర్లలో కెల్లా తమ దేశ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఎంతో ఉత్తమమైనదని, చాలా అనుభవం కలిగినదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ని నిలిపివేస్తామనడానికి ఆ  దేశాలకు కారణాలు కనబడడంలేదని, ఎందుకిలా వ్యాఖ్యానిస్తున్నాయో  తెలియడంలేదని అన్నారు. మనమంతా ఈ వ్యాక్సిన్ ని వినియోగిస్తున్నాం కదా అని వ్యాఖ్యానించారు. అసలు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తమకెంతో విశ్వాసం ఉందని,  మా దేశవ్యాప్తంగా ఇది చాలా వేగవంతంగా కొనసాగుతోందని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.  ఇలా ఉండగా ఇన్ని యూరప్ దేశాలు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై బ్యాన్ విధించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరప్ మెడిసిన్స్ ఏజెన్సీ దీనిపై సమీక్షించేందుకు నడుం కట్టాయి.

మరిన్ని ఇక్కడ చదవండి: గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆప్ బరోడా.. ఎంత తగ్గించిందో తెలుసా..

Best Wedding Wardrobe : ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం