AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లోరిడాలో కారుపైకి దూసుకు వెళ్లిన సింగిల్ ఇంజన్ విమానం, ఇద్దరి మృతి, వాహనంలోని తల్లీ బిడ్డలకు తీవ్ర గాయాలు వీడియో

ఫ్లోరిడా లోని శివారు  'పెంబ్రోక్ పైన్స్' ప్రాంతంలో  వేగంగా వెళ్తున్న ఓ కారు పైకి సింగిల్ ఇంజన్ తో కూడిన చిన్న విమానమొకటి కిందకు నేరుగా దూసుకువచ్చి దాన్ని ఢీ కొంది.

ఫ్లోరిడాలో కారుపైకి దూసుకు వెళ్లిన సింగిల్ ఇంజన్ విమానం, ఇద్దరి మృతి, వాహనంలోని తల్లీ బిడ్డలకు తీవ్ర గాయాలు వీడియో
Plane Crash In Florida
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 16, 2021 | 7:54 PM

Share

ఫ్లోరిడా లోని శివారు  ‘పెంబ్రోక్ పైన్స్’ ప్రాంతంలో  వేగంగా వెళ్తున్న ఓ కారు పైకి సింగిల్ ఇంజన్ తో కూడిన చిన్న విమానమొకటి కిందకు నేరుగా దూసుకువచ్చి దాన్ని ఢీ కొంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఇద్దరు వ్యక్తులు మరణించగా..కారు లోని ఓ మహిళ, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ వ్యక్తి ఇంటి డోర్ కి గల రింగ్ కెమెరా ఈ  యాక్సిడెంట్ దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఈ ఘటనలో క్రాష్ జరిగిన ప్రాంతమంతా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. విమానం, కారు రెండూ తుక్కుతుక్కు కాగా శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన మహిళను, చిన్నారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.  మండిపోతున్న కారులో తన తల్లి ఒడిలో ఉన్న బాలుడిని అతి కష్టం మీద రక్షించారు. దగ్గరలో ఓ బాంబు పడినట్టుగా పెద్ద శబ్దం వినిపించిందని, చూడగా రోడ్డు మార్గమంతా మంటలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు.  నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది.

ఆకాశంలో ఎగురుతున్న విమానం హఠాత్తుగా కిందకు ఎలా దూసుకువచ్చిందో, ఎలా నేరుగా కారుపై పడిందో. అంతా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఇది పైలట్ తప్పిదమా , లేక విమానంలో ఇంధనం అయిపోవడమా అన్నది తెలియడంలేదు. ఈ విధమైన ప్రమాదాలు చాలా అరుదని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: Dr M Gurumurthy : తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ కు డాక్టర్‌ ఎం గురుమూర్తి పేరు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!