Dr M Gurumurthy : తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ కు డాక్టర్ ఎం గురుమూర్తి పేరు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
YSRCP Tirupathi MP Candidate Dr M Gurumurthy : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది..
YSRCP Tirupathi MP Candidate Dr M Gurumurthy : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ ఎం గురుమూర్తి పేరును అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొంచెం సేపటిక్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం గతేడాది నవంబర్ లోనే ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించారు కూడా.
డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్య నారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి, వరప్రసాద్, బి.మధుసూదన్ రెడ్డి, కె.ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరుల సలహాలు తీసుకొని చివరికి గురుమూర్తిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
అంతేకాదు, దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ చక్రవర్తికి లేదా దుర్గాప్రసాద్ భార్యకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్ మాట ఇచ్చిన తర్వాతే డాక్టర్ గురుమూర్తి పేరును అప్పుడే ఖరారు చేశారు సీఎం జగన్. తాజాగా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డ నేపథ్యంలో గురుమూర్తి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించింది.
Read also : PK Sinha : పీఎం మోదీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ నిష్క్రమణ