- Telugu News Photo Gallery Political photos Dandi yatra 75 years of indias independence on the occasion of dandi yatra day sixteen ornaments flourished in ahmedabad see photos
దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు.. 75 వారాల పాటు దేశ స్వాతంత్ర వేడుకలు.. అత్యంత సుందరంగా సబర్మతి ఆశ్రమం
తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
Updated on: Mar 16, 2021 | 6:30 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన అమృత్ మహోత్సవ్ వేడుకలకు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో విరజిల్లుతోంది.

అహ్మదాబాద్ నగరం అత్యంత సుందరంగా కనిపిస్తోంది. లైటింగ్ సిస్టమ్ దృశ్యం ఆకట్టుకుంటుంది.

దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ సమాధి , 'అక్షర్ ఘాట్' సమీపంలో సబర్మతి ఆశ్రమం సమీపంలో ప్రత్యేకంగా అలంకరించారు.

1930 లో చారిత్రాత్మక దండి యాత్రలో మహాత్మా గాంధీ చేసిన మార్గంలోనే దండి యాత్ర కొనసాగుతుంది. మొదట 81 మంది గాంధీ అనుచరులు ఈ దండి యాత్ర ప్రారంభమైంది.

గాంధీజీ ఆశ్రమంతో పాటు రివర్ ఫ్రంట్, ఇతర ప్రదేశాలలో అత్యంత సుందరంగా అలంకరించారు.

తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడకలను నిర్వహిస్తున్నారు.





























