- Telugu News Photo Gallery World photos Australia women protest against sexual violence and inequality see pictures
ఆస్ట్రేలియాలో మహిళలకు కోపం వచ్చింది. ఆడవారిపై అఘాయిత్యాలను ఆపాలంటూ నల్ల బట్టలు ధరించి నిరసన
రాజకీయ కార్యాలయాల్లో లైంగిక హింస, లింగ అసమానతలకు వ్యతిరేకంగా నిరసనగా ఆస్ట్రేలియాలో వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. దేశ రాజధానితో సహా 40 ప్రధాన నగరాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు.
Updated on: Mar 15, 2021 | 10:13 PM

మహిళలకు న్యాయం చేయాలని కోరుతూ సిడ్నీలో ప్లకార్డులు, బ్యానర్లతో వేలాది మంది ర్యాలీ

రాజకీయ కార్యాలయాల్లో లైంగిక హింస, లింగ అసమానతలకు వ్యతిరేకంగా నిరసనగా ఆస్ట్రేలియాలో వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. దేశ రాజధానితో సహా 40 ప్రధాన నగరాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు.

రాజధాని కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్ ముందు వందలాది మంది ప్రదర్శన చేశారు. వారి చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని 'జస్టిస్ ఫర్ ఉమెన్', ఉమెన్ మార్చ్ ఇన్ ఆస్ట్రేలియా అంటూ నినాదించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది మహిళలు నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు.

ఆస్ట్రేలియాలో వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. లైంగిక హింస, లింగ అసమానతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఆస్ట్రేలియాలో మహిళలకు రక్షణ కల్పించాని డిమాండ్ చేస్తూ ప్రజలు సోమవారం రాజధాని కాన్బెర్రాతో సహా ఇతర ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు చేపట్టారు.

1988 లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్‌కు మోరిసన్ మద్దతు ఇవ్వడం గమనార్హం. అప్పుడు అతనే 17 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని పోర్టర్ ఖండించారు.

రక్షణ మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిట్నీ హిగ్గిన్స్ అనే మహిళా ఉద్యోగి ఇటీవల తనపై అత్యాచారం జరిగిందని ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లితే పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది.

తనపై ఆరోపణలు చేసిన మహిళ గత ఏడాది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. అదేవిధంగా, రక్షణ మంత్రి లిండా రేనాల్డ్ కూడా 2019 సంవత్సరంలో తన కార్యాలయంలో అత్యాచారానికి గురైన మహిళకు సరైన సహాయం ఇవ్వకపోవడంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు.
