- Telugu News Photo Gallery Technology photos Electricity Train: How electric train works.. How many volts of electricity are needed?
Electricity Train: రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్ అవసరం.. ట్రైన్‌కు కరెంటు సరఫరా ఎలా అవుతుంది?
Electricity Train: స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం రైల్వే వ్యవస్థలో అనేక మార్పులకు గురైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలక్ట్రిక్ రైళ్లకు ఎన్ని వోల్ట విద్యుత్ అవసరమో మీకు తెలుసా..? ఈ ట్రైన్‌లకు విద్యుత్ సరఫరా ఎలా అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Updated on: Mar 29, 2025 | 5:04 PM

Electricity Train: మన భారతీయ రైల్వేకు ప్రత్యేక స్థానముంది. దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ రైలులో పలు మార్పులు చేశారు. స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం రైల్వే వ్యవస్థలో అనేక మార్పులకు గురైంది. వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ ఇంజిన్. ఈ రోజుల్లో చాలా రైళ్లు కరెంటుతో నడుస్తున్నాయి. దీంతో రైలు వేగం కూడా పెరుగుతుంది. కానీ రైలుకు సరఫరా చేసే విద్యుత్ ఎప్పుడూ ఎందుకు నిలిపవేయరనే విషయం మీకు తెలుసా?

రైల్వే ప్రకారం.. ఎలక్ట్రిక్ రైళ్లకు 25 వేల వోల్టేజ్ (25 kV) అవసరం. ఈ కరెంట్ పాంటోగ్రాఫ్ ద్వారా ఇంజిన్‌కు చేరుకుంటుంది. ఇది ఇంజిన్ పైన అమర్చిన యంత్రం. పాంటోగ్రాఫ్ రైలు పైభాగానికి జోడించిన వైర్‌తో ఘర్షణ ద్వారా కదులుతుంది. ఈ వైర్ల ద్వారా రైలుకు విద్యుత్తు సరఫరా అవుతుంది.

ఎలక్ట్రిక్ రైళ్లలో రెండు రకాల పాంటోగ్రాఫ్‌లను ఉపయోగిస్తారు. డబ్ల్యుబిఎల్ డబుల్ డెక్కర్ ప్యాసింజర్ కోసం ఉపయోగిస్తారు. సాధారణ రైళ్లలో హై స్పీడ్ పాంటోగ్రాఫ్‌లను ఉపయోగిస్తారు. పాంటోగ్రాఫ్ ద్వారా ఓవర్ హెడ్ వైర్ నుండి కరెంట్ సరఫరా అందుతుంది. ఇది 25KV (25,000 వోల్ట్లు) విద్యుత్ మోటారు ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంట్‌ను అందిస్తుంది. ఇది మోటారును నడుపుతుంది.


రైల్వేలు నేరుగా పవర్ గ్రిడ్ నుండి విద్యుత్తును పొందుతాయి. గ్రిడ్ పవర్ ప్లాంట్ నుండి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి అన్ని స్టేషన్లకు పంపుతారు. సబ్ స్టేషన్ నుండి నేరుగా 132 KV సరఫరా రైల్వేలకు వెళుతుంది. ఇక్కడి నుంచి ఓ.హెచ్.ఈ. 25కేవి రైల్వే స్టేషన్ల సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్లు కనిపిస్తాయి. నేరుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రిప్పింగ్ ఉండదు.




