- Telugu News Photo Gallery Technology photos Smart TVs at lowest price on Amazon, check details in telugu
Best smart TVs: కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
ఆధునిక కాలానికి అనుగుణంగా వివిధ రకాల ఫీచర్లతో అనేక కంపెనీల స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. మంచి క్లారిటీ, స్క్రీన్, క్వాలిటీతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో 43 అంగుళాల టీవీలు ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి. వాటిని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నా.. ధర గురించి సామాన్యులు భయపడతారు. అయితే అమెజాన్ లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన 43 అంగుళాల టీవీలు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.30 వేల లోపు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీల ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 29, 2025 | 5:30 PM

ఎల్ జీ 43 అంగుళాల స్మార్ట్ టీవీలోని 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, ఏ5 ఏఐ ప్రాసెసర్ 4కే జెన్6 తో విజువల్స్ అద్బుతంగా కనిపిస్తాయి. 4కే అప్ స్కేలర్ తక్కువ రిజల్యూషన్ కంటెంట్ ను మెరుగుపరుస్తుంది. ఏఐ సౌండ్, ఏఐ అకౌస్టిక్ ట్యూనింగ్ కలిగిన 20 డబ్ల్యూ స్పీకర్లతో ఆడియో చాలా బాగుంటుంది. గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తదితర వివిధ యాప్ లకు యాక్సెస్ లభిస్తుంది. కనెక్టివిటీకి సంబంధించి వైఫై, బ్లూటూత్ 5.0, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి. గేమింగ్, స్ట్రీమింగ్, వినోదం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ టీవీ అమెజాన్ లో రూ.30,990కు అందుబాటులో ఉంది.

సినిమాలు, క్రీడలు, గేమింగ్ కోసం షియోమి ఎంఐ టీవీ ఎంతో బాగుంటుంది. డాల్బీ విజన్, హెచ్ డీఆర్10, హెచ్ ఎల్జీ టెక్నాలజీతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రియాలిటీ ప్లో ఎంఈఎంసీ, వివిడ్ పిక్చర్ ఇంజిన్ మోషన్ తో రంగులు చక్కని క్లారిటీతో కనిపిస్తాయి. ఇక డాల్బీ ఆడియో, డీటీఎస్-ఎక్స్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ తో కూడిన 30 డబ్ల్యూ స్పీకర్ల నుంచి మంచి ఆడియో వినవచ్చు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ తదితర వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ తో వాయిస్ నియంత్రణకు వీలుంటుంది. కనెక్టివీటి కోసం డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్ల్యూటూత్ 5.0, బహుళ హెచ్ డీఎంఐ, యూఎస్ బీ పోర్టులు ఏర్పాటు చేశారు. అమెజాన్ లో రూ.23,999కు ఈ టీవీ అందుబాటులో ఉంది.

క్రిస్టల్ యూహెచ్ డీ సిరీస్ నుంచి విడుదలైన సామ్సంగ్ 43 అంగుళాల టీవీ మంచి వినోదాన్ని అందిస్తుంది. క్రిస్టల్ ప్రాసెసర్ 4కే ద్వారా ఆధారితమైన ఈ టీవీలో హెచ్ డీఆర్ 10 ప్లస్, యూహెచ్ డీ డిమ్మంగ్, పర్ కలర్ కారణంగా చిత్ర నాణ్యత పెరుగుతుంది. క్యూ సింఫనీ, అడాప్టివ్ సౌండ్, అబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ తో కూడిన 20 డబ్ల్యూ స్పీకర్లతో ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. బిక్స్ బీ వాయిస్, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ ఎయిర్ ప్లే తో అందుబాటులో ఉంది. సినిమాలు వీక్షించడంతో పాటు గేమింగ్ కు బాగుంటుంది. అయితే గేమింగ్ పనితీరును ఆటో గేమ్ మోడ్ (ఏఎల్ఎల్ఎం), వీఆర్ ఆర్ ఆప్లిమైజ్ చేస్తాయి. అమెజాన్ లో రూ.30,990కి సామ్సంగ్ టీవీ అందుబాటులో ఉంది.

సినిమాలు, వివిధ వినోద కార్యక్రమాలు వీక్షించడానికి, గేమింగ్ కు సోనీ బ్రావియా 2 సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఎంతో బాగుంటుంది. 4కే ఎక్స్ రియాలిటీ ప్రో, మోషన్ ప్లో ఎక్స్ ఆర్ 100 టెక్నాలజీతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కనెక్టివిటీ కోసం మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, యూఎస్ బీ పోర్టు ఏర్పాటు చేశారు. గేమింగ్ కన్సోల్ లు, సెట్ టాప్ బాక్సులు, డ్రైవ్ లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అమెజాన్ లో రూ.38,990కి ఈ టీవీ అందుబాటులో ఉంది.

తోషిబా 43 అంగుళాల సీ350 ఎన్పీ సిరీస్ టీవీలోని 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, డాల్బీ విజన్ టెక్నాలజీతో మంచి వీక్షణ అనుభవం కలుగుతుంది. సినిమాలు, వివిధ షోలు చూడడంతో పాటు గేమింగ్ కూ ఉపయోగపడుతుంది. దీనిలోని శక్తివంతమైన రంగులు, లోతయిన కాంట్రాస్ట్ తో చిత్ర నాణ్యత బాగుంటుంది. దీనిలో మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, అంతర్నిర్మిత వైఫై, బ్లూటూత్, ఈథర్నెట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాల యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ తో వాయిస్ నియంత్రణ, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లు బాగున్నాయి. అమెజాన్ లో రూ.22,999కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.





























