- Telugu News Photo Gallery Technology photos Amazon offers five popular smartphones for under 15000 know price offers details in telugu
Smart Phones: రూ.15 వేలకే పసందైన ఫోన్లు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు
ఇటీవల కాలంలో యువత స్మార్ట్ ఫోన్స్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అధికంగా మధ్యతరగతి ప్రజలు ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు బడ్జెట్ ధరల్లో సూపర్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా రూ.15 వేల ధరకే అమెజాన్‌లో సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
Srinu |
Updated on: Mar 28, 2025 | 10:19 PM

Galaxy M 35సామ్‌సంగ్ కంపెనీకు చెందిన గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్‌ఫోన్ వివిధ డిస్కౌంట్లతో 6 జీబీ + 128 జీబీ వేరియంట్ కేవలం రూ.13,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో అందుబాటులో ఉంది.

లావా బ్లేజ్ డుయో 5 జీ 6జీబీ +128 జీబీ మోడల్ ఫోన్‌ను కేవలం రూ.16,998కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌ను రూ.15,000 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఒక చిన్న స్క్రీన్ ఉంది. ఈ ఫోన్ రెండు ఎమోఎల్ఈడీ స్క్రీన్‌లను కలిగి ఉన్న మొదటి ఫోన్. ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ స్క్రీన్ 120 హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ ఫోన్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది.

పోకో ఎం7 ప్రో 5జీ 6 జీబీ+128 జీబీ ఫోన్‌ను కేవలం రూ. 13,990కు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఆకట్టుకుంటుంది.

రియల్ మీ నార్జో 70 టర్భో 5 జీ 6 జీబీ + 128 జీబీ మోడల్ డిస్కౌంట్ల తర్వాత రూ. 13,999కు అందుబాటులో ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ సూపర్ స్లిమ్ అంటే కేవలం 7.6 మిమీతో ఆకట్టుకుంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఫొటోగ్రఫీ ప్రియులను ఆకర్షిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం16 5జీ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ఫోన్ అమెజాన్‌లో రూ.13,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్‌లతో పాటు కూపన్ డిస్కౌంట్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోఎల్ఈడీ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటాయి. అలాగే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ బ్యాక్ కెమెరా ఆకర్షిస్తుంది.





























