- Telugu News Photo Gallery Technology photos Here are the best 40inch smart Tvs in 2025, check details in telugu
Best 40Inch Tvs: తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ టీవీలు.. కేవలం రూ. 15వేలలోపే బెస్ట్ బ్రాండ్లు..!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే మంచి పెద్ద స్మార్ట్ టీవీ, హోమ్ థియేటర్ వంటివి ఏర్పాటు చేసుకునేందుకు చాలా కుటుంబాలు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవల పెరిగిన ఓటీటీల ప్రభావం కూడా ఇందుకు ఓ కారణం. అయితే అందరూ పెద్ద టీవీలు కొనలేరు. ఇంటి పరిస్థితి కూడా అందుకు సహకరించకపోవచ్చు. అంటే ఇంటి పరిమాణం చిన్నగా ఉంటే పెద్ద టీవీలు అక్కడ సెట్ అవ్వవు. అయితే 40 అంగుళాల టీవీలు మిడ్ సైజ్ లో ఉంటాయి. మరీ పెద్దగా కనిపించవు. బెడ్ రూం అయినా, హాల్ అయినా మీకు 40 అంగుళాలు బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు అలాంటి టీవీ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. ప్రస్తుత మార్కెట్లోని బెస్ట్ 40 అంగుళాల స్మార్ట్ టీవీలను మీకు పరిచచయం చేస్తున్నాం. వీటిల్లో 4కే రిజల్యూషన్, మంచి రిఫ్రెష్ రేట్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Updated on: Mar 28, 2025 | 6:37 PM

యాసర్ 40 అంగుళాల ఐ ప్రో సిరీస్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఈ టీవీ ఫీచర్ ప్యాక్డ్ గా ఉంటుంది. స్టైలిష్ డిజైన్ ఉంటుంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14, గూగుల్ టీవీ ఆధారంగా పనిచేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్ స్టార్ వంటి యాప్స్ ను సపోర్టు చేస్తుంది. 30వాట్ల డాల్బీ ఆడియో హైఫై స్పీకర్స్ ద్వారా శక్తివంతమైన సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ అందిస్తోంది. దీని ధర అమెజాన్లో 16,999గా ఉంటుంది.

బ్లాపoక్ట్ సైబర్ సౌండ్ జీ2 సిరీస్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీ మీకు బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తుంది. హెచ్డీఆర్ టెక్నాలజీ, అల్ట్రా బ్రైట్ నెస్ డిస్ ప్లే, క్రిస్ప్, రిచ్ కలర్స్ తో మంచి వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3 హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, వాయిస్ కంట్రోల్ వంటివి ఉంటాయి. మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర అమెజాన్లో 14,499గా ఉంది.

కోడక్ 40 అంగుళాల 9ఎక్స్ ప్రో సిరీస్ ఫుల్ హెచ్డీ ఆండ్రాయిడ్ టీవీ.. దీనిలో హెచ్డీఆర్, సూపర్ కాంట్రాస్ట్ టెక్నాలజీతో కూడిన ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్టు చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ వంటి ఫీచర్లు ఉంటాయి. 30వాట్ల డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్, డీటీఎస్ హెచ్డీ టెక్నాలజీతో మంచి సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంపై పోర్టులు, యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 14,999గా ఉంది.

టీసీఎల్ మెటాలిక్ బెజెల్ లెస్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. ఇంటి వినోదాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడానికి చూస్తుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఇది ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ ప్యానల్ హెచ్డీఆర్10, ఏఐపీక్యూ ఇంజిన్ సాయంతో మీకు రిచ్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ను అందిస్తుంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ సాయంతో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ ఇస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లలో యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్ ను అందిస్తుంది. 19వాట్ల డాల్బీ ఆడియో సిస్టమ్ ను కలిగి ఉంటుంది. వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ కనెక్టివిటీని అందిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 15,990గా ఉంది.

వీడబ్ల్యూ ఫ్రేమ్ లెస్ సిరీస్ ఫుల్ హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ ఫ్రేమ్ లెస్ టీవీ ఫుల్ హెచ్డీతో మంచి వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో ఐపీఐ టెక్నాలజీ ఉంటుంది. హెచ్డీఆర్ 1 కెపబులిటీతో అత్యద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఇంటిగ్రేషన్ కారణంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, యూ ట్యూబ్ వంటి యాప్స్ కు ఈ టీవీ సపోర్టు చేస్తుంది. 24వాట్ల స్టీరియో సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. దీనిలో రెండు హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టు, వైఫై, ఎథర్ నెట్ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ సాయంతో మల్టీ టాస్కింగ్ కు అనుకూలిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 12,499గా ఉంది.




