ఫోన్ వాడటం మానేసిన మొదటి రోజు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫోన్ రింగ్ వినిపిస్తే నోటిఫికేషన్స్ చూడాలని, సోషల్ మీడియా స్క్రోల్ చేయాలని కోరిక కలుగుతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
రెండు లేదా మూడు రోజులకు ఒత్తిడి తగ్గుతుంది. ఫోన్ వాడని సమయంలో పుస్తకం చదవడం లేదా చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడడం లాంటివి పనులు చేయడం మొదలుపెడతారు. మనసు కాస్త తేలిక అవుతుంది.
ఫోన్ స్క్రీన్ లేకపోవడంతో రాత్రి బ్లూ లైట్ ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల నిద్ర త్వరగా పడుతుంది. ఉదయాన్నే ఫ్రెష్‌గా ఏ బాదరబంది లేకుండా లేస్తారు.
ఒక వారం తర్వాత, ఫోన్ లేకపోవడంతో రోజూవారి పనులపై ఎక్కువ ఫోకస్ చేయగలరు. పుస్తకం చదవడం, పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మనసు కుదుటపడుతుంది.
ఫోన్ లేకపోతే కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో రిలేషన్స్ అనేవి బలపడతాయి. ఆన్‌లైన్ కంటే నిజజీవితం ఎక్కువ ఆనందం దొరుకుతుందని అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మిమ్మల్ని పోల్చుకోవడం ఆగిపోతుంది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటం తగ్గి, మనసు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతుంది.
ఫోన్ వాడకపోతే కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఎన్నో సృజనాత్మక పనులను మొదలుపెడతారు. మీలో దాగున్న ప్రతిభ బయటకొస్తుంది.
ఒక నెల పూర్తయ్యేసరికి ఫోన్ అంత అవసరం లేనట్లు అనిపిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆరోగ్యం మెరుగవడం, కుటుంబంతో సంతోషంగా గడపడం లాంటివి పెరుగుతాయి.