శని గ్రహం చుట్టూ ఉండే రింగ్ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా
సౌర కుటుంబంలో భాగమైన శని గ్రహం, అన్ని గ్రహాల్లోకెల్లా ప్రత్యేకంగా ఉంటుంది. దీని చుట్టూ వలయాలు ఉంటాయి. వీటి ఆధారంగా మనం ఇది శనిగ్రహం అని టక్కున గుర్తుపడతాం. కానీ, ఇప్పుడు శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయం అయ్యాయి. ఇది ఒక ఖగోళ వింత. శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు మాయం కావడంతో ఇదేమన్న యుగాంతానికి సంకేతమా? లేక ఏలియన్స్ ఏమైనా చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజానికి అలాటిందేం లేదట.. ఆ వలయాలు ఎక్కడికి పోలేదట.. ఆ వలయాలు భూమి మీదనుంచి చూసే మనకు కనిపించవట. ఎందుకంటే.. ఆ వలయాలు ఇప్పుడు భూమికి సమాంతరంగా ఉన్నాయని, కాస్త ఒంపుగా ఉంటే కనిపించేవని పరిశోధకులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం భూమికి సమాంతరంగా ఉండటంతో అవి అదృష్యమైనట్లు చెబుతున్నారు. 2009 తర్వాత మొదటిసారిగా ఇలా జరిగిందని, రింగ్ ప్లేన్ క్రాసింగ్ అని పిలువబడే ఈ ఖగోళ వింత తాజాగా మరోసారి సంభవించిందని తెలిపారు. భూమి, ప్రస్తుతం.. శని వలయ తలం గుండా వెళ్తోందని, అందుకే ఆ వలయం కనిపించడంలేదని పేర్కొన్నారు. శని గ్రహం 26.7 డిగ్రీల వంపు కారణంగా ఇది జరిగిందట. శని గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతుండటంతో వలయాలు దిశను మార్చుకుంటున్నట్లు కనిపిస్తాయని, ప్రతి 13 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి, శని వలయాలు భూమి దృష్టి రేఖతో సమాంతరంగా రావడంతో ఆ వలయాలు కనిపించవని వెల్లడించారు. చాలా చోట్ల వలయాలు పది మీటర్ల మందం మాత్రమే ఉన్నందున, అంచున చూసినప్పుడు అవి వాస్తవంగా కనిపించవు. అయితే ఇది తాత్కాలికమే అని, ఈ నెల తర్వాత మళ్లీ శనిగ్రహం వంపు మార్చుకున్న తర్వాత మళ్లీ వలయాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేదికపై వధూవరుల ఫోటో సెషన్.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి
అసహ్యకరమైన చేప.. చూస్తేనే ఒళ్లంతా వణుకు!
బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
