ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో
తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే చాలా మంది కలవరానికి గురవుతుంటారు. అమ్మో జుట్టు రాలిపోతోందని ఎంతో అందోళన చెందుతారు. ఎందుకంటే జుట్టు అందానికే కాదు.. ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒత్తయిన జుట్టు ఉన్నవారికి అందంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం అనేక రకాల కేశసంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి జుట్టు సడన్ గా ఊడిపోతే.. అది కూడా ఓ వారం రోజుల్లోనే మొత్తం వెంట్రుకలు రాలిపోయి.. బట్టతల వస్తే..? ఇలా ఎలా జరుగుతుంది అంటారా.. ఆ గ్రామంలో అలాగే జరుగుతోంది.
దీనికి వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సడెన్‌గా జుట్టు ఊడిపోయి, బట్టతల వచ్చేస్తే, ఎవరికైనా ఎలా ఉంటుంది. మానసికంగా డిస్టర్బ్ అవుతారు. మొన్నటిదాకా చాలా జుట్టు ఉండేది.. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని బాధపడతారు. జుట్టు ఎక్కువగా ఉండటం అనేది చాలా మందికి ప్లస్ అవుతుంది. కెరీర్ పరంగా వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. కానీ జుట్టు ఊడిపోతే, అదో అసంతృప్తిగా ఉంటుంది. నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ.. డిప్రెషన్ లోకి వెళ్తుంటారు.నిగనిగలాడే జుట్టు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాంటిది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న జుట్టు వారం రోజుల్లోనే పూర్తిగా రాలిపోయి బట్టతల వచ్చేస్తే.. అమ్మో ఇంకేమైనా ఉందా? అని భయపడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతోమందిని జుట్టు రాలే సమస్య వేధిస్తూనే ఉంటుంది. మహారాష్ర్టలోని మూడు గ్రామాల ప్రజలకు మాత్రం అలాంటి ఊహించని సంఘటనే జరిగింది.