బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??
మనం ఆవు పాలు, మేక పాలు, గాడిద పాల గురించి విన్నాం.. కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా? ఛీ.. యాక్! బొద్దింక పాలా? బొద్దింకకు అంత మ్యాటర్ ఉందా అని మాత్రం అడగకండి. ఎందుకంటే బొద్దింకల పాలే భవిష్యత్‌లో సూపర్ ఫుడ్ కానుందట. బొద్దింక పాలల్లో ఆవు, గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలున్నాయని తాజాగా కనుగొన్నారు.
ఇక సూపర్ ఫుడ్ అనే పదాన్ని మనం దేనికి వాడతాం. ఫిట్‌నెస్, వెల్‌నెస్, ఆకు కూరలు, బెర్రీలు, గింజలు, ఇలా పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సూపర్ ఫుడ్స్ అంటాం. ఇప్పుడా లిస్ట్‌లో చేరిన బొద్దింక పాలు పెద్ద మొత్తంలో తయారుచేయచ్చా? కమర్షియల్‌గా మార్కెట్‌లోకి ఎప్పుడు రావచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. బొద్దింక పేరు చెబితేనే చాలా మంది భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంట్లో నిత్యం బొద్దింకలు తిరుగుతుంటే వాటిని ఎలా నివారించాలా అని తలలు పట్టుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా..బొద్దింక పాలను ఇప్పుడు పరిశోధకులు సూపర్ ఫుడ్‌లో ఒకటిగా చేర్చారు. బొద్దింక పాలు చాలా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా డిప్లోప్టెరా పంక్టాటా అనే పెసిఫిక జాతికి చెందిన బొద్దింక పాలు ఆవు, గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని తేల్చారు. ఈ ఆవిష్కరణ పోషకాహార నిపుణులలో ఆసక్తిని పెంచింది. బొద్దింక పాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని ఎవరైనా అనుకుంటారా. కానీ ఈ బొద్దింక పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. భూగ్రహంపై అత్యంత పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటిగా ఉంటుందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: