మారేడు ఫలంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే… అస్సలు వదలరు
హిందూ సంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనిని దేవతా వృక్షంగా భావిస్తారు.అందుకే ఈ చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు. పరమశివునికి మారేడు దళాలన్నా, మారేడు కాయలన్నా ఎంతో ప్రీతి. అందుకే శివుని అభిషేకంలో మారేడు దళం తప్పక ఉపయోగిస్తారు. ఒక్క మారేడు దళం భక్తితో సమర్పిస్తే చాలు భోళాశంకరుడు ఇట్టే కరుణిస్తాడని హిందువుల విశ్వాసం.
అలాంటి మారేడు దళాలే కాదు.. మారేడుకాయలు కూడా ఎంతో విశిష్టమైనవి. శివుని పూజకే కాదు.. మనిషి ఆరోగ్యానికి మారేడు ఫలం సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇబ్బందిపెట్టే పలురకాల సమస్యల్ని నివారించడంలో దీన్ని మించింది లేదని చెబుతారు. అందుకే ఈ సమయంలో ఇతర జ్యూస్‌లతో పాటు మారేడుపండు రసం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. వేసవికాలంలో కమ్మని కొబ్బరినీళ్లు, చల్లని పండ్ల రసాలూ, చెరకు రసాలూ, మంచినీళ్ల చలివేంద్రాలు… ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తాయి. ఇవి వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు వాటి పక్కన మారేడు జ్యూస్ కూడా వచ్చి చేరింది. కేవలం జ్యూస్ మాత్రమే కాదు… ఈ మారేడు కాయలతో రకరకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ మారేడు ఫలంలో అపారమైన పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

