సమ్మర్ లో చల్లచల్లని వెనీలా ఐస్ క్రీం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
samatha
30 march 2025
Credit: Instagram
వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఇంట్లోనే వెనీల ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సినవి : పాలు, 300 మి.లీ. చక్కెర ఒక కప్పు, మొక్కజొన్న పిండి 1 టీస్పూన్, వెనిల్లా ఎసెన్స్ 1/2 టీస్పూన్, తాజా క్రీమ్ ఒక కప్పు.
ఒక మెటల్ కంటైనర్ తీసుకొని, అందులో 300 మి.లీ చల్లని పాలు తీసుకోవాలి, అందులో మొక్కజొన్న పిండి వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి.
మొక్కొజొన్న పిండిని పాలతో కలిపిన తర్వాత, స్టవ్ ఆన్ చేసి, పిండి కలిపిన పాలను తక్కువ మంటపై వేడి చేయాలి. అవి చిక్కబడే వరకు కలుపుతూ వేడి చేసుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమంలో ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అది ముద్దలా తయారైపోతుంది. అందుకే చక్కెర,మొక్కజొన్న పిండి వేసిన పాలను కలుపుతూ వేడి చేసుకోవాలి.
తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్రీమీ ఐస్ క్రీం కోసం, ఒక మిక్సిజార్ తీసుకొని అందులో ఒక కప్పు తాజా క్రీమ్ వేసుకోవాలి.
ఆ జార్ లో మొక్కజొన్న పిండి, పాలతో కలిపిన మిశ్రమాన్ని వేసి, వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక కంటెనైర్లో పోయాలి.
ఐస్ క్రీమ్ పైన ఐస్ ఏర్పడకుండా కంటైనర్ పై అల్యూమినియం ఫాయిల్ కప్పి దానిని ఎనిమిది నంుచి 9 గంటల వరకు ఫ్రిజ్ లో ఉంచాలి. అంతే చల్ల చల్లని ఐస్ క్రీమ్ రెడీ.