పుచ్చకాయ తిన్న తర్వాత అస్సలే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
samatha
24 march 2025
Credit: Instagram
సీజన్ ఫ్రూట్స్‌లలో పుచ్చకాయ ఒకటి. ఇది ఎండాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా పుచ్చకాయను తింటుంటారు.
అంతే కాకుండా పుచ్చకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో దీనిని తినడం వలన ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువలన డీ హైడ్రేషన్ సమస్యలతో బాధపడేవారు దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన చాలా యాక్టివ్‌గా ఉంటారు.
అందుకే సమ్మర్‌లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పుచ్చకాయ ఉంటుంది. అయితే కొంత మంది పుచ్చకాయ విషయంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు వారికి అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. అవి:
పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలే తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణుల. అందులో ముఖ్యంగా, పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదంట.
ఇలా చేయడం వలన ఇది జర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే పుచ్చకాయ తిన్న తర్వాత పాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
పుచ్చకాయ తిన్న తర్వాత అస్సలే కోడి గుడ్డు తినకూడదంట. దీని వలన కడుపు సమస్యలే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
కొందరు మాంసాహారం తిన్న తర్వాత పుచ్చకాయ తింటుంటారు. ఇలా కూడా తినకూడదంట. అలాగే పుచ్చకాయ తిన్న తర్వాత ప్రోటీన్ ఆహారాలు కూడా తినకూడదంటున్నారు నిపుణులు.