భారతదేశంలోని తమిళనాడులో ఉన్న అందమైన హిల్ స్టేషన్‌లో కొడైకెనాల్ ఒకటి. పైన్ అడవులు, పొగమంచులోయలతోఇది పర్యాటకులను ఎంతోగానో ఆకర్షింస్తుంది.
కొండల రాణి అని పిలువబడే ఊటీ నీలగిరి కొండలలో ఉంది.ఇక్కడి టీ ఎస్టేట్‌లు, పచ్చని చెట్లు అలాగే నీలగిరి పర్వత రైల్వే పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తుంది.
అది పెద్ద హిల్ స్టేషన్‌లో కూనూర్ ఒకటి. ఇక్కడ చల్లటి వాతావరణం, రకరకాల పూలు, పక్షలు, దట్టమైన అడవులు, కొడలతో ఉన్న ఇది పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
పర్యాటకుల మనసు దోచుకునే హిల్ స్టేసన్‌లో మున్నార్ ఒకటి. ఇది కేరళలో ఉంది. పశ్చిమ కనుమల్లోని ప్రకృతి అందాలతో ఇది చూడటానికి చాలా బాగుంటుంది.
అందమైన హిల్ స్టేషన్‌లో కూర్గ్ ఒకటి. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడి కాఫీ తోటలు, పచ్చటి వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఇండియాలోని తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లో ఏర్కాడ్ ఒకటి. ఇక్కడి సుందరమైన తోటలు, పచ్చని చెట్లు, సరస్సు, జలపాతాలకు ప్రసిద్ధి చెందినది.
కేరళలోని ప్రశాంతమైన కొండ ప్రాంతం వాగమోన్, ఇక్కడి దట్టమైన అడువులు, నీలి కొండలు,నదులు, జలపాతాలు, అలాగే కొన్ని కట్టడాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.
అలాగే ఇక్కడి కురిసుమల ఆశ్రమం కురిసుమల కొండలలోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి ఇది క్రైస్తవ యాత్రికుల ఆశ్రమం దాని ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.