AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మార్చి 30-ఏప్రిల్ 5, 2025): ఏలిన్నాటి శని ప్రారంభం అయినందువల్ల అనేక రకాలుగా ఖర్చులు పెరగడం మొదలవుతుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి లాభ స్థానంలోకి శని ప్రవేశించినందువల్ల ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. ఈ వారమంతా శుభ వార్తలు ఎక్కువగా వింటారు. మిథున రాశి వారికి దశమ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించడంతో ఉద్యోగంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 30, 2025 | 5:01 AM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఏలిన్నాటి శని ప్రారంభం అయినందువల్ల అనేక రకాలుగా ఖర్చులు పెరగడం మొదలవుతుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ధన స్థానంలోని గురువు వల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలోకి శని ప్రవేశించినందువల్ల ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. ఈ వారమంతా శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో క్రమంగా కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహా యం చేయగల స్థాయికి చేరుకుంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా కోలుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు తృప్తికరంగా సాగిపోతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దశమ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించడంతో ఉద్యోగంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరిగి, ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.  ఆరోగ్యం పట్ల మరింతగా శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శనీశ్వరుడు భాగ్య స్థానంలోకి ప్రవేశించడంతో కొన్ని కష్టనష్టాలు, ఆలస్యాలు, వృథా ఖర్చులు, అద నపు బాధ్యతలు, వ్యయప్రయాసల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. తండ్రి ఆరో గ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి అష్టమ శని ప్రారంభమైనందువల్ల ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బాగా సన్నిహితులు దూరమవుతారు. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగ స్వామితో సఖ్యత, సాన్నిహిత్యం తగ్గుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన సఫలం కావు. ఇతర గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశికి సప్తమ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించినందువల్ల అధిక పని భారం, అదనపు బాధ్యతలు, అలవికాని లక్ష్యాలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు వెనుకపట్టుపడతాయి. వ్యయ ప్రయాసలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గురువు కొనసాగుతున్నందువల్ల శని ప్రభావం బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉన్నా ఫలితం ఉంటుంది. ఆస్తి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి ఆరవ స్థానంలోకి శని ప్రవేశించడం వల్ల అనేక సమస్యలు, వివాదాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడం ప్రారంభం అవుతుంది. అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్థిరాస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి అర్ధాష్టమ శని తొలగిపోయినందువల్ల జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలో్ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం విష యంలో శ్రద్ధ వహించాలి. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం ఉత్తమం. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశికి అర్ధాష్టమ శని ప్రారంభమైనందువల్ల ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు కొద్దిగా తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. శుభ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఉచ్ఛలో ఉన్న శుక్ర గ్రహం వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది.  వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధు వులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశికి ఏలిన్నాటి శని తొలగిపోయినందువల్ల ఆదాయం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఎదుచు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి, ప్రాధాన్యం పెరగడానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలను విస్తరించుకునే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. వ్యక్తిగత సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ద్వితీయ స్థానంలోకి ప్రవేశించినందువల్ల కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ఆదాయ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో లేనిపోని సమస్యలు, అపార్థాలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆర్థికంగా మీ మీద ఒత్తిడి ఉంటుంది. శుభ కార్యాలకు విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శుక్రుడు, గురువు అనుకూలత కారణంగా ఏలిన్నాటి శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. ఆస్తి వివాదాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలోకి శని ప్రవేశం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు రాశ్యధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల కొన్ని శుభ పరిణామాలకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు.  విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

12 / 12
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..