- Telugu News Photo Gallery Spiritual photos Ugadi 2025 Telugu Horoscope: vishwavasu nama samvatsara predictions for 12 zodiac signs
Ugadi Rashi Phalalu: ఉగాది నుంచి ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Ugadi 2025 Rashi Phalalu: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు): మేష రాశి వారికి ఉగాది నుంచి ఏలిన్నాటి శని ప్రారంభమవుతుంది. అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. శని లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందున ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఉగాది 2025 ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Mar 29, 2025 | 7:20 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం 2, వ్యయం 14 | రాజపూజ్యాలు 5 అవమానాలు 7: ఈ రాశికి ఉగాది నుంచి ఏలిన్నాటి శని ప్రారంభమవుతోంది. దీని వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిప్పట, శ్రమ, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమూ ఒక పట్టాన పూర్తి కాదు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఇంట్లో అంచనాలకు మించిన ఖర్చుతో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశాల్లో లేదా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందగిస్తాయి. మే 25న గురువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ప్రయత్నపూర్వక ధన లాభం ఉంటుంది. ఆదాయ వృద్ధికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. మే 18న లాభ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం లేదా నవ గ్రహాలకు తరచూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యాలు 1, అవమానాలు 3: ఈ రాశివారికి విశ్వావసు నామ సంవత్సరమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉగాదితో లాభ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మే 18న దశమంలో రాహువు ప్రవేశంతో ఉద్యోగంలో అందలాలు ఎక్కడంతో పాటు ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మే 25న ధన స్థానంలోకి గురువు ప్రవేశంతో ఆదాయం బాగా పెరగడంతో పాటు, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు క్రమబద్ధంగా విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యాలు 4, అవమానాలు 3: మార్చి 29న శనీశ్వరుడు దశమ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశివారికిఝ ఉద్యో గంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యానికి లోటుండదు. ఉద్యోగు లకు, నిరుద్యోగులకు విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం చాలా మంచిది. ఉద్యో గంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మే 18న భాగ్య స్థానం లోకి రాహువు, మే 25న మిథున రాశిలోకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆర్థిక వ్యవహా రాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయం 8, వ్యయం 2 | రాజపూజ్యాలు 7, అవమానాలు 3: ఈ రాశివారికి ఉగాదితో అష్టమ శని వెళ్లిపోతున్నందువల్ల అనేక కష్ట నష్టాల నుంచి బయట పడడం ప్రారంభం అవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభ కార్యాలన్నీ జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం మొద లవుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. మే 25న గురువు వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తున్నం దువల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పే అవకాశం ఉంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. మే 18న రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశివారు సుందర కాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గిపో తాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కొద్దిగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొద్ది శ్రమతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం 11, వ్యయం 11 | రాజపూజ్యాలు 3, అవమానాలు 6: మార్చి 20 తర్వాత ఈ రాశివారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. దీనివల్ల ప్రతి పనిలోనూ తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతాయి. బాగా సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, మే 25న లాభస్థానంలోకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అష్టమ శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అనవసర ఖర్చులు, నష్టదాయక వ్యవహారాలతో ఇబ్బంది పడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా ముందుకు సాగుతాయి. ఈ రాశివారు తరచూ గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యాలు 6, అవమానాలు 6: ఈ రాశికి దశమ స్థానంలోకి శని, దశమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మే 18న ఆరవ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాది రిగానే అనుకూలంగా కొనసాగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మార డానికి చేస్తున్న ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుం డదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపో తాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనేక విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యాలు 2, అవమానాలు 2: ఈ రాశికి మార్చి 29 తర్వాత శని ఆరవ మస్థానంలోకి, మే 25 తర్వాత గురువు భాగ్య స్థానంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారు విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అంచనాలకు మించి లాభాలు పొందుతారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసు లోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా శుభ పరిణా మాలతో సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పద వులు పొందుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనా రోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ రాశివారు లలితా సహస్ర నామం పఠించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయం 2, వ్యయం 14 | రాజపూజ్యాలు 5, అవమానాలు 3: మార్చి 29తో అర్ధాష్టమ శని తొలగిపోతున్నందువల్ల కొన్ని కష్టనష్టాల నుంచి, ప్రతికూల పరిస్థి తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకో వడం మొదలవుతుంది. మే 18న రాహువు నాలుగవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మే 25 తర్వాత గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా సమస్యాత్మకంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవలసి ఉంటుంది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరు గుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆదాయం 5, వ్యయం | రాజపూజ్యాలు 1, అవమానాలు 5: ఈ రాశివారికి ఉగాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతున్నప్పటికీ మే 18 నుంచి రాహువు తృతీయ స్థానంలో, మే 25 నుంచి గురువు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఈ ఏడాదంతా అర్ధా ష్టమ శని ప్రభావం బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పనిభారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాబడి పరంగా దూసుకుపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభి స్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. శుభ కార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. అనా రోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాలు పెళ్లిళ్లకు దారితీస్తాయి. ఈ రాశివారు ఎక్కువగా శివార్చన చేయించడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 4, అవమానాలు 5: ఈ రాశివారికి మార్చి 29తో ఏలిన్నాటి శని తొలగిపోతోంది. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ముఖ్యమైన కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఈ రాశివారి జీవితం అనేక విషయాల్లో తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. మే 25న గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది కానీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. శుభ కార్యాల మీద అంచనాలకు మించి ఖర్చవుతుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. ఈ రాశివారు ఎక్కువగా శివార్చన చేయడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 3, అవమానాలు 5: ఈ రాశికి ఉగాది నుంచి ధన, కుటుంబ స్థానంలోకి శని ప్రవేశించడం వల్ల రెండవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం అవుతుంది. ఆర్థిక, కుటుంబ సమస్యలకు, ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాట తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో ఖర్చులు పెరగడం, ఆటంకాలు ఏర్ప డడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు జటిలంగా మారే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మందగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరు గుతాయి. మే 25న గురువు పంచమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు, చదువులకు అవకాశం ఉంటుంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాఫీగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ రాశి వారు శివార్చన చేయించడంతో పాటు తరచూ నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యాలు 3, అవమానాలు 11: ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గుతుంది. మే 18న రాహువు వ్యయ స్థానంలోకి రావడం, మే 25న గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా అంచనాలు, లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.





























