AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్‌.. మరింత పెరిగిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ఇప్పుడు కొనలేని పరిస్థితికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు పరుగులు తీయడమే అందుకు కారణం. ఇప్పటికే తులం బంగారం ధర రూ.92 వేల మార్కు దాటి రికార్డు సృష్టించింది. ఇక ఆదివారం పుత్తడి ధరలు మరికాస్త పెరిగి పసిడి ప్రియుల కంట కన్నీరు పెట్టించింది..

Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్‌.. మరింత పెరిగిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Price
Srilakshmi C
|

Updated on: Mar 30, 2025 | 7:10 AM

Share

హైదరాబాద్‌, మార్చి 30: పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. కానీ గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర రూ.92 వేల మార్కు దాటి రికార్డు సృష్టించింది. ఇక ఈ రోజు పుత్తడి ధరలు మరికాస్త పెరిగి పసిడి ప్రియుల కంట కన్నీరు పెట్టించింది. శనివారం (మార్చి 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,010 పలకగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,800 పలికింది. ఇక కిలో వెండి ధర రూ. 1,03,950 పలికింది. ఇక ఈ రోజు ఏకంగా 24 క్యారెట్ల బంగారం తులం రూ.92,400 చేరుకుంది. ధరల జోరు చూస్తుంటే త్వరలోనే లక్ష మార్కు చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.92,400 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 84,000 పలుకుతుంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.89,630 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 82,600 పలుకుతుంది.
  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.91,150 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 84,400 పలుకుతుంది.
  • రాజమహేంద్రవరంలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.91,800 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 83,540 పలుకుతుంది.
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 83,600 పలుకుతుంది.

ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి శనివారం రూ.1,03,950 ఉండగా ఈ రోజుకి ధర కాస్త తగ్గింది. మార్చి 30న కిలో వెండి ధర రూ.1,02,684 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో పెరిగింది. అక్కడ కిలో వెండి శనివారం రూ.1,02,100 ఉండగా ఈ రోజు రూ.1,03,200 పలుకుతోంది. ప్రొద్దుటూరులో నిన్న రూ.1,02,000 ఉండగా ఈ రోజుకి రూ.1,01,200కి దిగొచ్చింది. రాజమహేంద్రవరంలో నిన్న కిలో వెండి రూ.1,03,000 ఉండగా ఈ రోజు రూ.1,05,000కి పెరిగింది. విశాఖపట్నంలో శనివారం కిలో వెండి ధర రూ.1,05,000 ఉండగా.. ఆదివారం నాటికి ఇంకాస్త పెరిగి రూ.1,08,000కి చేరుకుంది.

కాగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది.. అలాగే అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతుంది. మన దేశంలో లభించే బంగారం అంతా దాదాపుగా దిగుమతి చేసుకున్నదే. ఇక అమెరికా డాలర్‌ విలువ కూడా మన దేశంలో పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు వేరువేరుగా ఉన్నప్పటికీ.. పన్నులు, సుంకాలు కలిపితే దాదాపు అన్ని చోట్ల ధరలు ఒకేలా ఉంటాయి. అయితే ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ఆయా షాపుల్లో తేడాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.