AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నాడు గరిష్ట స్థాయిలో బాణుడు తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపాడు. చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. ఇక శనివారం మరింత తీవ్రంగా ఎండలు మండనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని..

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!
Heatwave Alert
Srilakshmi C
|

Updated on: Mar 29, 2025 | 8:27 AM

Share

హైదరాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నాడు గరిష్ట స్థాయిలో బాణుడు ప్రతాపం చూపాడు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ రోజు కూడా ఎండ తీవ్రత మరింత పెరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 23 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41, కనిష్టంగా నల్లగొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

నిన్న (మార్చి 28) తెలంగాణ లోని నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఖమ్మం, రామగుండం, మెదక్, హైదరాబాద్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. నిజామాబాద్..40.8 డిగ్రీలు, ఆదిలాబాద్..40.8 డిగ్రీలు, భద్రాచలం..39 డిగ్రీలు, మహబూబ్ నగర్..39 డిగ్రీలు, ఖమ్మం..38.8 డిగ్రీలు, రామగుండం..38.4 డిగ్రీలు,మెదక్..38.3 డిగ్రీలు, హైదరాబాద్..38.2 డిగ్రీలు, హనుమకొండ..37 డిగ్రీలు, నల్లగొండ..37 డిగ్రీల చొప్పున పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలోనూ మండుతున్న ఎండలు…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. శనివారం (మార్చి 29) రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. 223 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా -6, విజయనగరం-9, పార్వతీపురంమన్యం -12, అల్లూరి సీతరామరాజు-3, కాకినాడ-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో తీవ్రవడగాలులు(35) ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఓ మోస్తరు వడగాలులు వీచే మండలాలు.. శ్రీకాకుళం జిల్లా -19, విజయనగరం జిల్లా-16, పార్వతీపురంమన్యం జిల్లా-2, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, విశాఖ-3, అనకాపల్లి-16, కాకినాడ-15, కోనసీమ-12, తూర్పుగోదావరి-17, పశ్చిమగోదావరి-10, ఏలూరు-17, కృష్ణా -15, ఎన్టీఆర్-12, గుంటూరు-17, బాపట్ల-8, పల్నాడు-24, ప్రకాశం-9, నెల్లూరు-1, తిరుపతి-2 మండలాల్లో వడగాలులు (223) వీచే అవకాశం ఉంది. రేపు ఆదివారం 85 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్రవడగాలులు, 90 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచెర్ల, వైఎస్సార్ జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 42°C, అనంతపురం జిల్లా గుంతకల్లు, పల్నాడు జిల్లా నడిగడ్డలో 41.9°C, విజయనగరం జిల్లా నెలివాడలో 41.8°C, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 41.5°C, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. అలాగే నిన్న 181 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డుమోత మోగించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.