ఎగ్జామ్ హాల్‌లో కొడుకు.. బయట తండ్రి.. కట్ చేస్తే కటకటాలపాలైన ఇద్దరూ!
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఈ ఘటన జరిగింది. పరీక్ష రాసినందుకు వచ్చిన విద్యార్థి ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక తెల్ల పేపర్ మీద పశ్నలు మొత్తం రాసి బయట ఉన్న తన తండ్రికి కిటికీ ద్వారా విసిరాడు. ఆ క్వశ్చన్స్‌కు సంబంధించిన జవాబులను పేపర్ మీద రాసి తండ్రి కుమారుడికి హెల్ప్ చేశాడు. ఇది గమనించిన స్వాడ్ టీమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరితోపాటు మరో నలుగురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీక్‌కు సంబంధించిన వ్యవహారంలో ఆరుగురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నకిరేకల్‌లో టెన్త్ పేపర్ లీక్ కి సంబంధించిన వ్యవహారంలో ఏ స్థాయిలో దుమారం జరిగిందో తెలిసిందే. టెన్త్ క్లాస్ విద్యార్ధిని పరీక్ష రాస్తున్న టైమ్‌లో కిటికీలో నుండి కొందరు అగంతకులు బలవంతంగా విద్యార్థిని దగ్గర క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకుని దాన్ని ఇతరులకు పంపించారు. దీంతో ఆ విద్యార్థిని సైతం పోలీసులు తప్పుపట్టారు. వెంటనే విద్యార్థిని డిబార్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సదర విద్యార్థి హైకోర్టులో ఆశ్రయించింది. తనకు సంబంధం లేని వ్యవహారంలో డిబార్ చేయడం వల్ల తనకు నష్టం కలిగిందని ఆరోపిస్తూ హై కోర్ట్ లో ఝాన్సీ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలోనే ఈ పిటిషన్‌పై హై కోర్ట్ విచారణ జరపనుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..