AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology: గడ్డం బాబుల స్టైల్‌.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది!.. ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..

ఒకప్పుడు లవ్‌ ఫెయిల్యూర్స్, నిరుద్యోగులు, మందుబాబులు గడ్డాలు పెంచేవారు. కానీ నేటి కాలంలో వీరితోపాటు మేముకూడా ఉన్నాం అంటూ కొందరు యువకులు తైల సంస్కారం లేని అడవి మాదిరి గడ్డాలు పెంచేసి తిరుగుతున్నారు. సాధారణంగా వివాహిత పురుషులు గడ్డం పెంచుతుంటారు. ఎందుకంటే..

Psychology: గడ్డం బాబుల స్టైల్‌.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది!.. ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Beard Psychology
Srilakshmi C
|

Updated on: Mar 28, 2025 | 1:07 PM

Share

నేటి అబ్బాయిల మోస్ట్‌ వాంటెడ్‌ స్టైలిష్‌ ట్రెండ్‌.. గడ్డం పెంచడం. ఒకప్పుడు లవ్‌ ఫెయిల్యూర్స్, నిరుద్యోగులు, మందుబాబులు గడ్డాలు పెంచేవారు. కానీ నేటి కాలంలో వీరితోపాటు మేముకూడా ఉన్నాం అంటూ కొందరు యువకులు తైల సంస్కారం లేని అడవి మాదిరి గడ్డాలు పెంచేసి తిరుగుతున్నారు. సాధారణంగా వివాహిత పురుషులు గడ్డం పెంచుతుంటారు. అందుకే గతంలో ఎవరైనా గడ్డం పెంచిన వెంటనే ఏదైనా విశేషమా? శుభవార్తా? అని అందరూ అడిగేవారు. కానీ నేటి కాలంలో గడ్డం పెంచుకోవడం కూడా ఒక ట్రెండ్‌గా మారింది. స్టైలిష్‌గా కనిపించేందుకు రకరకాల గడ్డాలు పెంచేస్తున్నారు గడ్డం బాబులు. ఫ్రెంచ్, చిన్‌స్ట్రైప్, గౌటి, ఫుల్ బార్డ్, సోల్ ప్యాచ్ వంటి వివిధ స్టైల్స్‌ ఫాలో అవుతుంటారు. అయితే మీకు తెలుసా..? మీరు పెంచే గడ్డం స్టైల్.. మీరెలాంటి వారనేది ఎదుటి వారికి సంకేతాలను ఇస్తుంది. మీ గడ్డం చూడగానే మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే వెల్లడిస్తుంది. ఎలాగంటే..

పొడవాటి గడ్డం

కొంతమందికి చాలా పొడవాటి గడ్డాలు పెరుగుతాయి. ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరిపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు చూడటానికి క్రూరంగా కనిపించినప్పటికీ చాలా సాదు స్వభావులు. దయగలవారు. నమ్మదగినవారు. ధైర్యవంతులు కూడా. ప్రశాంత స్వభావము కలిగిన ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. అందరినీ ఆకర్షించడానికి సాధారణంగా గుంపులో ప్రత్యేకంగా కనిపించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వారికి హాస్యం బాగా నచ్చుతుంది. ఎవరైనా జోక్‌ వేస్తే టాప్‌ లేచిపోయేలా బిగ్గరగా నవ్వుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

గ్యుయెట్ గడ్డం

ఈ రకమైన గడ్డం చిన్న గొర్రె గడ్డంలా కనిపిస్తుంది. అందుకే దీనిని గ్యుయెట్ గడ్డం అని పిలుస్తారు. ఇలాంటి గడ్డాలు ఉన్న వ్యక్తులు సామర్థ్యం గలవారు. నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. వీరు తమదైన పాత విలువలు, నమ్మకాలలో పాతుకుపోతారు. తమ కట్టుబాట్లను నిలబెట్టుకోవడానికి, దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. వారు తమ కుటుంబానికి, ప్రియమైనవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ భావాలను నేరుగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు తమ జీవిత భాగస్వామిని ప్రాణం కన్నా మిన్నగా ఎక్కువగా ప్రేమిస్తారు.

ఇవి కూడా చదవండి

స్టబుల్ గడ్డం

గడ్డం ఆకారం ఇలా ఉన్నవారు క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించడానికి, సాహసోపేత కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. వీరు మరింత పరిణతి చెందినవారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వందసార్లు ఆలోచిస్తారు. తమ హాస్య చతురతతో అందరికీ దగ్గరవుతారు. విమర్శకులుగా, వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించి తదుపరి అడుగులు వేస్తారు. వీరు అనుకున్న సమయంలోనే తమ పనిని పూర్తి చేస్తారు. అందువల్ల వారిని హార్డ్ వర్కర్స్ అని పిలుస్తారు.

ఫ్రెంచ్ గడ్డం

ఫ్రెంచ్ గడ్డం ఉన్న వ్యక్తులు వ్యవస్థీకృత, నమ్మకంగా ఉండే వ్యక్తులు. సమస్యలను పరిష్కరించే విధానం వల్ల వీరిని అందరూ తెలివైనవారిగా, పరిణతి చెందినవారిగా పిలుస్తుంటారు. తమ చుట్టూ ఉన్నవారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వీరు చేసే పనులు, వాటి పరిణామాలు ఏమిటో ఖచ్చితంగా అంచనా వేస్తుంటారు.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ