AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Result Date 2025: ఇంటర్‌ విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 9,96,971 విద్యార్థులు పరీక్షలు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఈ పరీక్షలు రాశారు. ప్రధాన సబ్జెక్టు పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగియడంతో ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది..

Inter Result Date 2025: ఇంటర్‌ విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?
Inter Result Date
Srilakshmi C
|

Updated on: Mar 26, 2025 | 12:09 PM

Share

హైదరాబాద్‌, మార్చి 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం (మార్చి 25)తో ముగిశాయి. ప్రధాన సబ్జెక్టు పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమవగా మార్చి 25తో అన్ని పరీక్షలు ముగిశాయి. తొలుత కొన్ని ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడంతో హల్‌చల్ చేసినా… ఆ తర్వాత సజావుగానే పరీక్షలు జరిగాయి.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 విద్యార్థులు పరీక్షలు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాశారు. వీరిలో ఫస్టియర్‌లో విద్యార్థులు 4,88,448 మంది, సెకండియర్‌ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. ఇక గతంలో ఫెయిలైన విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల్లో అక్కడక్కడా కొందరు విద్యార్ధులు కాపీ కొడుతూ డీబార్‌ అయినప్పటికీ సింహభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

ఇక ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లల్లో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. మూల్యాంకనం అనంతరం ఇంటర్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ నెలాఖరులోపు విడుదల చేసే లక్ష్యంతో అధికారులున్నారు. ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది మార్చి 19వ తేదీకి పరీక్షలన్నీ పూర్తికాగా, ఏప్రిల్‌ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్‌ చివరి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..