AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!

ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ వ్యక్తి పొరుగింటి మహిళతో చనువుగా ఉండసాగాడు. గమనించిన మహిళ భర్త అనుమానం పెంచుకున్నాడు. అంతే సదరు వ్యక్తిని మూడో కంటికి తెలియకుండా సజీవంగా పాతిపెట్టి అంతమొందించాడు. కొన్నాళ్లకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు.. అయితే చివరికి ఒకేఒక్క ఆధారంతో మొత్తం కథను బయటకు లాగారు..

7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
Yoga Teacher Buries Alive
Srilakshmi C
|

Updated on: Mar 26, 2025 | 11:45 AM

Share

చండీగఢ్‌, మార్చి 26: ఎంతో డీసెంట్‌ కనిపించే ఓ వ్యక్తి మూడో కంటికి తెలియకుండా ఓ వ్యక్తిని సజీవ సమాధి చేశాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ముందుగా బాధితుడిని కిడ్నాప్‌ చేసి, అనంతరం ఏడు అడుగుల లోతైన గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. నేరం జరిగిన మూడు నెలల తర్వాత మార్చి 24న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఈ దారుణం వెలుగు చూసింది. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలోని చార్కి దాద్రిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో జగదీప్‌ అనే వ్యక్తి యోగా టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గతేడాది డిసెంబర్ 24న విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జగదీప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిందితుడు అతని చేతులు, కాళ్లు కట్టేసి, శబ్దం చేయకుండా నోటికి టేపులు కట్టాడు. ఆ తర్వాత అతన్ని నిర్జన ప్రదేశంలో ఉన్న ఓ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు లోతైన గొయ్యి తవ్వి ఉండటం చూశాడు. బోరుబావి కోసం తవ్విన ఆ గుంతలో జగదీప్‌ను సజీవంగా పాతిపెట్టాడు. అనతరం ఏమీ ఎరగనట్లు ఇంటికి పోయాడు. అయితే కిడ్నాప్ జరిగిన 10 రోజుల తర్వాత ఫిబ్రవరి 3న జగదీప్ మిస్సింగ్ కేసు స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. పోలీసులు మూడు నెలల పాటు దర్యాప్తు చేశారు.

Yoga Teacher

ఇవి కూడా చదవండి

జగదీప్ కాల్ రికార్డులు ఈ కేసులో కీలకమైన ఆధారంగా నిలిచాయి. ఫోన్‌ కాల్స్ ఆధారంగా ధరంపాల్, హర్దీప్ అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కుల్దీప్ తెలిపారు. విచారణలో నిందితులు హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలను వెల్లడించారు. జగదీప్ అద్దెకు ఉంటున్న భవనంలోనే నివసిస్తున్న ఒక మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంబంధం ఆ మహిళ భర్తకు తెలియడంతో.. అతడే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. జగదీప్‌ను సజీవంగా పాతిపెట్టడానికి ముందు అతడిపై దాడి చేశారా? కత్తులతో పొడిచారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.