AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ.. పీఎం కిసాన్‌పై కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!

భారతదేశంలో ప్రజల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రకృత్తి విపత్తులతో పాటు ఇతర కష్టాల వల్ల రైతులు ఎప్పుడు ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని లాంచ్ చేసింది. ఈ పథకం ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలను సాయం చేస్తుంది.

PM Kisan: వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ.. పీఎం కిసాన్‌పై కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
Nikhil
|

Updated on: Mar 26, 2025 | 11:02 AM

Share

2019లో కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసే పీఎం-కిసాన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. అయితే రైతులకు సాయం చేసే ఉద్దేశంతో లాంచ్ చేసిన ఈ పథకంలో చాలా మంది అనర్హులు కూడా లబ్ధిపొందారు. అయితే పీఎం-కిసాన్ కింద అనర్హులైన రైతుల నుంచి ప్రభుత్వం రూ.416 కోట్లు వసూలు చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పార్లమెంట్‌లో తెలిపారు. ఈ పథకం ప్రారంభం నుంచి కేంద్ర ప్రభుత్వం 19 విడతల్లో రైతులకు రూ.3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని స్పష్టం చేశారు.

పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం మూడు సమాన వాయిదాలలో అర్హత కలిగిన భూస్వాముల రైతుల ఆధార్-సీడెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం- కిసాన్ పథకం ప్రారంభంలో ట్రస్ట్ ఆధారిత వ్యవస్థపై ప్రారంభమైందని, రాష్ట్రాలు స్వీయ-ధృవీకరణ ప్రాతిపదికన లబ్ధిదారులను నమోదు చేసుకున్నాయని చౌహాన్ తన లిఖితపూర్వకంగా తెలిపారు. 

పీఎం-కిసాన్ పథకం ప్రారంభంలో , కొన్ని రాష్ట్రాలకు ఆధార్ సీడింగ్‌ను కూడా సడలించారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు విడుదలయ్యేలా చూసుకోవడానికి, భూమి సీడింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపు. ఈ-కేవైసీ తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..