Viral Video: మోహన్‌లాల్ పూజలపై ముస్లిం సంస్థల ఆగ్రహం… మమ్ముట్టి కోలుకోవాలని శబరిమలలో మోహన్‌లాల్ పూజలు
ఇద్దరు దక్షిణాది సూపర్‌స్టార్లే . చాలామంది వాళ్లిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్ధులని పొరపడుతారు.. కాని ఇద్దరు ఆప్తమిత్రులు… మమ్ముటి , మోహన్‌లాల్ ఫ్రెండ్‌షిప్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్‌లాల్ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది. శబరిమలలో మోహన్‌లాల్ పూజలు చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మమ్ముటి ముస్లిం..

ఇద్దరు దక్షిణాది సూపర్‌స్టార్లే . చాలామంది వాళ్లిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్ధులని పొరపడుతారు.. కాని ఇద్దరు ఆప్తమిత్రులు… మమ్ముటి , మోహన్‌లాల్ ఫ్రెండ్‌షిప్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్‌లాల్ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది.
శబరిమలలో మోహన్‌లాల్ పూజలు చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మమ్ముటి ముస్లిం.. ఆయన అసలు పేరు మహ్మద్ కుట్టి.. అలాంటప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలని అల్లానే ప్రార్ధించాలి .. కాని అయ్యప్పస్వామిని ఎలా మోహన్‌లాల్ వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. శబరిమలలో మోహన్‌లాల్ ఆయన కోసం ప్రత్యేక పూజలు చేయడాన్ని తప్పుపడుతున్నాయి.
వాస్తవానికి చాలామంది అభిమానులు మోహన్‌లాల్ తీరును ప్రశంసించారు. కాని కొంతమంది ఇస్లామిక్ పద్దతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై విమర్శలు చేస్తున్న వాళ్ల తీరుపై మండిపడ్డారు మోహన్‌లాల్. మమ్ముట్టి తనకు ఆప్తమిత్రుడని , అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. మమ్ముట్టి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు..
మమ్ముట్టి ఆరోగ్యంపై గత కొంతకాలంగా సంచలన వార్తలు వెలుగు లోకి వస్తున్నాయి. మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని వివరణ ఇచ్చారు మమ్ముట్టి.. ప్రస్తుతం తాను రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నట్టు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
శబరిమలలో మోహన్‌లాల్ పూజలు చేసిన వీడియో చూడండి:
Empuran at Sabarimala 💫 An unapologetic Sanatani 🔥@Mohanlal 🙏 pic.twitter.com/nb61HeSQa2
— Prabhu #ProudBhartiya (@Prabhulog1) March 19, 2025