AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సంగారెడ్డిలో ఘోరం.. ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి ఆపై తానూ సేవించిన త‌ల్లి! ఆ తర్వాత

ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కన్న బిడ్డలు ముగ్గురికి తన చేతులతోనే విషం తినిపించింది. అనంతరం తానూ తిని ఆత్మహత్య చేసుకుందామని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తల్లి మాత్రం ఆస్పత్రికి ప్రాణాలతో చేరగా.. ముగ్గురు బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి..

Telangana: సంగారెడ్డిలో ఘోరం.. ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి ఆపై తానూ సేవించిన త‌ల్లి! ఆ తర్వాత
Mother Poisons 3 Children In Sangareddy District
Srilakshmi C
|

Updated on: Mar 28, 2025 | 10:19 AM

Share

సంగారెడ్డి, మార్చి 28: ఏ కష్టం వచ్చిందో ఓ తల్లి సొంత బిడ్డలకు తన చేతులతోనే విషం తినిపించింది. అనంతరం తానూ తిని ఆత్మహత్య చేసుకుందామని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తల్లి ప్రాణాలతో బయటపడింది గానీ.. కన్న బిడ్డలు ముగ్గురూ విషానికి బలైయ్యారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. వివరాల్లోకెళ్తే..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ర‌జిత అనే మహిళకు భర్త చెన్నయ్య, స్కూల్‌కు వెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ రంజిత త‌న ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి.. అనంతరం తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని ముగ్గురు పిల్లల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లల‌ను సాయికృష్ణ (12), మ‌ధుప్రియ‌ (10), గౌత‌మ్‌ (8)గా గుర్తించారు. బాధిత మ‌హిళ‌ను చికిత్స నిమిత్తం కుటుంబ స‌భ్యులు ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ర‌జిత ప‌రిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం. అసలేం జరిగిందంటే..

గురువారం రాత్రి రంజిత త‌న ముగ్గురు పిల్లల‌కు పెరుగు అన్నం తినిపించింది. అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించింది. భ‌ర్త చెన్నయ్యకు మాత్రం ప‌ప్పు అన్నం విడిగా పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు. భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే భార్య తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. నిద్రపోతున్న పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ క‌ల‌హాల కార‌ణంగానే ర‌జిత ఈ దారుణానికి పాల్పడిందా? లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..