ట్రెక్కింగ్ చేయాలనుకున్నా, పచ్చని కొండల మధ్య, స్నేహితులు, బంధువులతో ఎంజాయ్ చేయాలని అనుకుంటే తప్పకుండా అనంతగిరి కొండలకు వెళ్లాల్సిందే. ఇక్కడి ప్రకృతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
అద్భుతమైన కాఫీ తోటలకు లంబసింగి నిలయం. ఇక్కడ కాఫీ తోటలు, మిరియాల తోటలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సమ్మర్ బెస్ట్ టూర్ లో ఇది ఒకటి.
ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం నల్లమల కొండలు. ఇక్కడ ఎత్తైన కొండలు, సరస్సులు, పచ్చని చెట్లు, రకరకాల చెట్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.
సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తే అరకులోయ బెస్ట్. ఇక్కడి పొగమంచు లోయలు, పచ్చని అడవి , తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది హైదరాబాద్ కు చాలా దగ్గరగానే ఉంటుంది.
చిక్కడ మంగళూరు, ఇక్కడి కాఫీ తోటలు, తుంగ భద్ర నదులకు ఇది పుట్టినిల్లు, ఇక్కడ అత్యంత ఎత్తైన పర్వతాలు, కొండలు, కల్లథిగిరి జలపాతాలు, ప్రకృతి రమణీయ దృష్యాలతో పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
ఎలగిరి కొండలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. జలగంపరై జలపాతం, రోజ్ గార్డెన్. స్వీపింగ్ ఆర్చర్డ్స్ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.
శ్రీశైలంలోని అక్క మహాదేవి గుహలు చూడటానికి చాలా బాగుంటాయి. లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ గుహలు పర్యాటకులకు కనులవిందునిస్తాయి.
19 వ శతాబ్దపు బ్రిటిష్ నివాసి పేరు మీద పెట్టబడి ఉన్న ప్రదేశం హార్ల్సీ హిల్స్. ఇక్కడి ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.