GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు.. ముంబైతో ఏకంగా డైమండ్ డక్
Rahul Tewatia 1st Diamond Duck: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్ చాలా చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రనౌట్ అయ్యాడు. మరో విషయం ఏంటంటే, ఇందులో ఓ డైమండ్ డక్ కూడా ఉంది.

Rahul Tewatia 1st Diamond Duck: ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ ఓడిన గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే, గుజరాత్ తరపున ఓ బ్యాట్స్‌మన్‌కు మాత్రం ఈ మ్యాచ్ ఓ పీడకలలా మారింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 2వసారి రనౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో అంటే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెవాటియా సిక్స్ కొట్టి రెండో బంతికే రనౌట్ అయ్యాడు. ఇక రెండో మ్యాచ్‌లో డైమండ్ డక్ బాధితుడిగా మారాడు. అంటే, ఒక్క బంతి కూడా ఆడకుండా జీరోకే పెవిలియన్ చేరాడు. ఆ బ్యాటర్ ఎవరో కాదండోయ్.. రాహుల్ తెవాటియా.
హార్దిక్ కళ్లు చెదిరే త్రో..
ఈ సంఘటన 18వ ఓవర్‌లో చోటు చేసుకుంది. గుజరాత్ జట్టు ఆ సమయంలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అంటే, గుజరాత్ ఇన్నింగ్స్‌లో కేవలం 12 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువల్ల, 18వ ఓవర్ చివరి బంతికి వికెట్ పడింది. ఈ సమయంలో రాహుల్ తెవాటియాను వేగంగా పరుగులు చేసేందుకు క్రీజులోకి పంపించారు. కానీ, అతనికి దురదృష్టం ఎదురైంది. అతను బంతిని ఆడకుండానే రనౌట్ అయ్యాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ లాంగ్ ఆఫ్‌లో పవర్ ఫుల్ షాట్ కొట్టాడు. కానీ బంతి నేరుగా సర్కిల్‌లో నిలబడి ఉన్న హార్దిక్ పాండ్యా వద్దకు చేరింది. తెవాటియా బంతిని చూడకుండానే పరుగు లంఖించుకున్నాడు. ఈ పరుగు అతనికి ఖరీదైనదిగా నిరూపితమైంది. పాండ్యా విసిరిన త్రో వేగంగా వికెట్లను తాకింది. దీంతో తెవాటియా నిరాశగా పెవిలియన్ చేరాడు.
Pinpoint accuracy 🎯
Chaos in the middle and Hardik Pandya capitalizes with a direct hit to run Rahut Tewatia out!
Updates ▶ https://t.co/lDF4SwnuVR #TATAIPL | #GTvMI | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/PM4YQy46y4
— IndianPremierLeague (@IPL) March 29, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..