- Telugu News Photo Gallery Cinema photos Cute photos of bhagyashrii borse enjoying her vacation in Sri Lanka
మామిడిపండుతో రవితేజ బ్యూటీ.. క్యూట్ ఫొటోస్ వైరల్
అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన క్రేజీ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూ వారిని అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా చేతిలో మామిడిపండుతో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Mar 29, 2025 | 2:13 PM

హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది.

రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన సోషల్ మీడియాలో శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది.

శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. బెడ్ పై మామిడిపండ్ల ముక్కలను పెట్టుకొని, వాటిని వయ్యారంగా తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫొటోలను ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. శ్రీలంక వైబ్ కు మ్యాచ్ అయ్యేలా కాస్త స్వీట్ నెస్.. ఎవరైనా మామిడిని ప్రేమించే వారున్నారా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



