IPL 2021: ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్ ఎవరో తేలిపోయింది.. ఈసారి అవకాశం దక్కింది అప్‌స్టాక్స్‌కే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 (IPL 2021) అధికారిక భాగస్వామిని బీసీసీఐ (BCCI) డిక్లేర్ చేసింది. డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్, క్యాష్ రిచ్‌లీగ్ అఫీషియల్ పార్టనర్‌గా ఉంటుందని..
IPL 2021 official partner Upstox: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 (IPL 2021) అధికారిక భాగస్వామిని బీసీసీఐ (BCCI) డిక్లేర్ చేసింది. డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్, క్యాష్ రిచ్‌లీగ్ అఫీషియల్ పార్టనర్‌గా ఉంటుందని బీసీసీ తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలి మంగళవారం (March 16th)న భేటీ అయ్యింది. ఈ భేటీలో అప్‌స్టాక్స్‌ను ఎంపిక చేసి.. తమ భాగస్వామిగా ప్రకటించింది ఐపీఎల్ పాలక మండలి. మన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ ఐపీఎల్ భాగస్వామిగా ఉంటుంది. ఇది కేవలం ఒక్క ఏడాదికే పరిమితం అయ్యే ఒప్పందం కాదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం గురించి ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ.. లీగ్ అఫీషియల్ పార్టనర్‌గా అప్‌స్టాక్స్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతోపాటు విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్-డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న అప్‌స్టాక్స్ ఒప్పందం సరికొత్త ప్రయాణానికి నాంది అవుతుందని బ్రిజేశ్ పటేల్ వ్యాఖ్యానించారు.
ఆర్థికంగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే యువతకు అప్‌స్టాక్స్ మంచి దిక్సూచిగా మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. ఇక అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రవి కుమార్, బీసీసీఐతో ఒప్పందం తమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, భారతీయుల సంస్కృతీ, సంప్రదాయాలు, సామాజిక జీవనంలో ఒక భాగమని పేర్కొన్నారు. ముఖ్యంగా మిలియనీల్స్ (గత రెండు దశాబ్దాల్లో జన్మించిన వాళ్లు)పై ఐపీఎల్ ప్రభావం ఎక్కువగా ఉందని, అలాంటి లీగ్‌కు భాగస్వామిగా వ్యవహరించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ సరికొత్త కలయికతో దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్-2021 ప్రారంభం కానున్నది. చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
ALSO READ: కేరళ అసెంబ్లీ ఎన్నికల బరిలో కార్పొరేట్ సంస్థ.. పార్టీల స్థానంలో ఇక కార్పొరేట్ హౌజెస్?
ALSO READ: ఏకగ్రీవాలకు ఇక డిక్లరేషన్లు.. హైకోర్టు తీర్పుతో కదిలిన ఎన్నికల కమిషన్
ALSO READ: తెలంగాణ సర్కార్‌కు ‘సుప్రీం‘ ఊరట.. నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
ALSO READ: ప్రత్యేక కోర్టులో దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ వ్యూహంపై ఇపుడు ఉత్కంఠ