India vs England 3rd T20 Highlights: రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్.. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
India vs England 3rd T20I Live Score: అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 ప్రారంభమైంది...
India vs England 3rd T20I Highlights: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో 20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఘన విజయం సాధించింది. అధిక్యమే లక్ష్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఇంగ్లిష్ జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్ కేవలం 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్‌లతో 83 పరుగులు సాధించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బట్లర్‌కు అండగా నిలిచిన బరిస్టో కూడా కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లతో 40 పరుగులు చేసి ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో పాత్ర పోషించాడు.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్
ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మాలన్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కరన్, మార్క్ వుడ్, జోర్డాన్, ఆర్చర్, రషీద్
చివరి ఓవర్ 20 పరుగులు.. 20 ఓవర్లకు టీమిండియా 156/6
చివరి ఓవర్‌లో కోహ్లీ, పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్స్, ఫోర్‌తో పాటు నాలుగు పరుగులు తీయగా.. చివరి బంతికి పాండ్యా(17) ఔట్ అయ్యాడు. దీనితో 20 ఓవర్లకు టీమిండియా 156/6 పరుగులు చేసింది.
కోహ్లీ ఊచకోత.. వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్..
కోహ్లీ గేర్ మార్చాడు. మార్క్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. దీనితో 18 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
ఒక సిక్స్.. ఓ ఫోర్.. కోహ్లీ వీరవిహారం..
కెప్టెన్ కోహ్లీ దూకుడు పెంచాడు. ఆర్చర్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. దీనితో 16వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులో కెప్టెన్ కోహ్లీ..
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరోసారి మార్క్ వుడ్ అద్భుతమైన బంతులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టాడు. దీనితో 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది.
పంత్ రనౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా..
ఫామ్‌లో ఉన్న పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మూడు పరుగుకు ప్రయత్నించి.. సామ్ కరన్ బౌలింగ్‌లో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. దీనితో 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టానికి 71 పరుగులు చేసింది.
పంత్ వరుస ఫోర్లు.. 10 ఓవర్లకు భారత్ – 55/3
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(14), పంత్(20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. అనవసరమైన బంతులను వదిలేసి.. చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే రషీద్ వేసిన 10 ఓవర్ లో పంత్ వరుసగా రెండు ఫోర్లు సంధించాడు. ఇక 10 ఓవర్లు ముగిసే సమయంకి టీమిండియా 55/3 పరుగులు చేసింది.
మెయిడిన్ వికెట్…
టీమిండియా వికెట్ల పతనం కొనసాగుతోంది. మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీతో రెండో మ్యాచ్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులకే జోర్డాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అంతేకాకుండా జోర్డాన్ ఓవర్ మెయిడిన్‌గా పూర్తయింది. దీనితో 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టానికి 24 పరుగులు చేసింది.
ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు.. కీలక వికెట్..
టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(15) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. మార్క్ వుడ్ మరోసారి స్ట్రైక్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. దీనితో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.
మొదటి ఫోర్ కొట్టిన టీమిండియా..
రోహిత్ శర్మ మొదటి ఫోర్ బాదాడు. ఆర్చర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ బౌండరీ మీదుగా చక్కటి షాట్‌తో ఫోర్ బాదాడు. దీనితో టీమిండియా నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), ఇషాన్ కిషన్(4) ఉన్నారు.
మరోసారి విఫలమైన రాహుల్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో డకౌట్..
ఓపెనర్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ వైపు షాట్‌కు ట్రై చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
మొదటి ఓవర్ 5 పరుగులు.. ఆచితూచి ఆడిన ఓపెనర్లు..
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(4), రాహుల్(0) రషీద్ వేసిన మొదటి ఓవర్‌ను ఆచితూచి ఆడారు. ఈ ఓవర్‌లో టీమిండియా 5 పరుగులు రాబట్టింది. దీనితో ఓవర్ ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది.
LIVE NEWS & UPDATES
-
రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్.. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ ఇంగ్లండ్ గెలవగా దానికి సమాధానంగా టీమిండియా రెండో టీ20లో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌ను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లండ్ జట్టు భారత్‌పై భారీ విజయాన్ని అందుకుంది. బట్లర్ 83 పరుగులతో బరిస్టో 40 పరుగులతో రాణించడంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది.
-
బరిస్టో కూడా తగ్గట్లేదుగా.. కేవలం 7 పరుగులు మాత్రమే.
ఇంగ్లండ్ విజయానికి బట్లర్ మార్గం వేస్తే దానికి బరిస్టో కూడా అండగా నిలిచాడు. 25 బంతుల్లో 31 పరుగులు సాధించి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 13 బంతుల్లో కేవలం 7 పరుగుల దూరంలో ఉంది.
-
-
18 బంతులు 16 పరుగులు.. ఇంగ్లండ్ విజయం దాదాపు ఖరారు.
మూడో టీ20లో భారత్ పరాజయంవైపు అడుగులు వేస్తోంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బట్లర్ రాణించడంతో ఇంగ్లండ్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 18 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది.
-
30 బంతులు 30 పరుగులు.. ఇంగ్లండ్ స్పీడ్‌కు బ్రేక్‌లు పడతాయా.?
రెండో టీ20లో టీమిండియా విజయానికి ధీటుగా సమాధానం చెప్పే క్రమంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. భారత్ ఇచ్చిన 156 పరుగులు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇంగ్లండ్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది.
-
ఇంగ్లండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసిన భువీ..
విజయానికి చేరువవుతోన్న ఇంగ్లండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు టీమిండియా బౌలర్ భువీ. 13వ ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ స్కోర్‌ను కొంతలో కొంత కట్టడి చేశాడు. ప్రస్తుతం టీమిండియా బౌలర్లు ఈ విధంగా పరుగులు తగ్గిస్తేనే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది
-
-
దూకుడు మీదున్న బట్లర్ విజయానికి 50 పరుగుల దూరంలో ఇంగ్లండ్..
కేవలం 40 బంతుల్లో 66 పరుగులు చేసిన బట్లర్ ఇంగ్లండ్ జట్టును విజయ తీరాలకు చేర్చే కృషి చేస్తున్నాడు. ఇంగ్లండ్ విజయానికి మరో 50 పరుగులు దూరంలో ఉంది. ఇంకా 42 బంతులు 8 వికెట్లు చేతిలో ఉండడంతో ఇంగ్లండ్ విజయం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 107/2 వద్ద కొనసాగుతోంది. చూడాలి మరి ఏదైనా మ్యాజిక్ జరుగుతుందో.
-
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. మాలన్ స్టంపౌట్..
మాలన్ స్టంప్ ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో మాలన్ వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ 81/2
-
బట్లర్ అర్ధ సెంచరీ.. విజయానికి చేరువలో ఇంగ్లాండ్…
బట్లర్ అద్భుత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. దీనితో 9 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 78-1 చేసింది.
-
మరో రెండు ఫోర్లు కొట్టిన బట్లర్..
చాహల్ బౌలింగ్లో బట్లర్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. దీనితో ఇంగ్లాండ్ ఆరు ఓవర్లు ముగిసేసరికి 57-1 చేసింది.
-
ఐదో ఓవర్ 16 పరుగులు.. బట్లర్ ఊచకోత..
ఠాకూర్ బౌలింగ్‌లో బట్లర్ అద్భుత బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దీనితో 5 ఓవర్లకు ఇంగ్లాండ్ 46-1 చేసింది.
-
నాలుగో ఓవర్ 14 పరుగులు.. ఓ వికెట్..
చాహల్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇంగ్లాండ్ 14 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో రెండు సిక్సర్లు బట్లర్ బాదగా.. రాయ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.
-
రాయ్ వరుస ఫోర్లు.. మూడు ఓవర్లకు ఇంగ్లాండ్ 16/0
ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వరుస ఫోర్లు బాదాడు. దీనితో మూడు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 16/0 పరుగులు చేసింది.
-
ఇంగ్లాండ్ మొదటి ఓవర్లో 4 పరుగులు..
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్, రాయ్ మొదటి ఓవర్ ఆచితూచి ఆడారు. నాలుగు పరుగులు రాబట్టారు. దీనితో మొదటి ఓవర్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 4/0
-
చివరి ఓవర్ 20 పరుగులు.. 20 ఓవర్లకు టీమిండియా 156/6
చివరి ఓవర్‌లో కోహ్లీ, పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్స్, ఫోర్‌తో పాటు నాలుగు పరుగులు తీయగా.. చివరి బంతికి పాండ్యా(17) ఔట్ అయ్యాడు. దీనితో 20 ఓవర్లకు టీమిండియా 156/6 పరుగులు చేసింది.
-
కోహ్లీ ఊచకోత.. వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్..
కోహ్లీ గేర్ మార్చాడు. మార్క్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. దీనితో 18 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
-
ఒక సిక్స్.. ఓ ఫోర్.. కోహ్లీ వీరవిహారం..
కెప్టెన్ కోహ్లీ దూకుడు పెంచాడు. ఆర్చర్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. దీనితో 16వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులో కెప్టెన్ కోహ్లీ..
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరోసారి మార్క్ వుడ్ అద్భుతమైన బంతులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టాడు. దీనితో 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది.
-
పంత్ రనౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా..
ఫామ్‌లో ఉన్న పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మూడు పరుగుకు ప్రయత్నించి.. సామ్ కరన్ బౌలింగ్‌లో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. దీనితో 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టానికి 71 పరుగులు చేసింది.
-
పంత్ వరుస ఫోర్లు.. 10 ఓవర్లకు భారత్ – 55/3
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(14), పంత్(20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. అనవసరమైన బంతులను వదిలేసి.. చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే రషీద్ వేసిన 10 ఓవర్ లో పంత్ వరుసగా రెండు ఫోర్లు సంధించాడు. ఇక 10 ఓవర్లు ముగిసే సమయంకి టీమిండియా 55/3 పరుగులు చేసింది.
-
మెయిడిన్ వికెట్…
టీమిండియా వికెట్ల పతనం కొనసాగుతోంది. మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీతో రెండో మ్యాచ్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులకే జోర్డాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అంతేకాకుండా జోర్డాన్ ఓవర్ మెయిడిన్‌గా పూర్తయింది. దీనితో 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టానికి 24 పరుగులు చేసింది.
-
ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు.. కీలక వికెట్..
టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(15) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. మార్క్ వుడ్ మరోసారి స్ట్రైక్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. దీనితో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.
-
మొదటి ఫోర్ కొట్టిన టీమిండియా..
రోహిత్ శర్మ మొదటి ఫోర్ బాదాడు. ఆర్చర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ బౌండరీ మీదుగా చక్కటి షాట్‌తో ఫోర్ బాదాడు. దీనితో టీమిండియా నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), ఇషాన్ కిషన్(4) ఉన్నారు.
-
మరోసారి విఫలమైన రాహుల్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో డకౌట్..
ఓపెనర్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ వైపు షాట్‌కు ట్రై చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
-
మొదటి ఓవర్ 5 పరుగులు.. ఆచితూచి ఆడిన ఓపెనర్లు..
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(4), రాహుల్(0) రషీద్ వేసిన మొదటి ఓవర్‌ను ఆచితూచి ఆడారు. ఈ ఓవర్‌లో టీమిండియా 5 పరుగులు రాబట్టింది. దీనితో ఓవర్ ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది.
Published On - Mar 16,2021 10:35 PM