India vs England 3rd T20: మూడో టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం… సిరీస్ ఆధిక్యంలో ఇంగ్లిష్ జట్టు.
India vs England 3rd T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో 20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఘన విజయం సాధించింది. అధిక్యమే లక్ష్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్...
India vs England 3rd T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో 20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఘన విజయం సాధించింది. అధిక్యమే లక్ష్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఇంగ్లిష్ జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్ కేవలం 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు సాధించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బట్లర్‌కు అండగా నిలిచిన బరిస్టో కూడా కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లతో 40 పరుగులు చేసి ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే అంతకు ముందు టీమిండియా టాస్ ఓడి.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ పేసర్లకు సరైన సమాధానం చెబుతూనే ఆడారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ 46 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు. అయితే విరాట్ ఒక్కడే రాణించి మిగతా ప్లేయర్లు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మొదటి నుంచి తమ బ్యాట్లకు పని చెప్పారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఇరుజట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20పై అందరి దృష్టి పడింది. సిరీస్‌పై పట్టు సాధించాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. మరి మొతెరా వేదికగా మార్చి 18న జరగనున్న నాలుగో టీ20లో టీమిండియా గెలిచి సిరీస్‌పై పట్టు సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read: IPL 2021: ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్ ఎవరో తేలిపోయింది.. ఈసారి అవకాశం దక్కింది అప్‌స్టాక్స్‌కే..