AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Record: క్రికెట్‌ గాడ్‌ అద్భుత రికార్డుకు సరిగ్గా తొమ్మిదేళ్లు… కేట్‌ కట్‌ చేయించిన ప్లేయర్స్..

Sachin Record: భారత క్రికెట్‌ అభిమానులకు, ఇంకో మాట చెప్పాలంటే అసలు క్రికెంట్ అంటే ఏంటో తెలియని వారిలో కూడా సచిన్‌ టెండూల్కర్‌ పేరు తెలియని వారుండరనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. క్రికెట్‌ను...

Sachin Record: క్రికెట్‌ గాడ్‌ అద్భుత రికార్డుకు సరిగ్గా తొమ్మిదేళ్లు... కేట్‌ కట్‌ చేయించిన ప్లేయర్స్..
Sachin Tendulkar Record
Narender Vaitla
|

Updated on: Mar 16, 2021 | 11:34 PM

Share

Sachin Record: భారత క్రికెట్‌ అభిమానులకు, ఇంకో మాట చెప్పాలంటే అసలు క్రికెంట్ అంటే ఏంటో తెలియని వారిలో కూడా సచిన్‌ టెండూల్కర్‌ పేరు తెలియని వారుండరనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే భారత్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ను క్రికెట్‌ గాడ్‌గా భావిస్తుంటారు. తన సుధీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను సొంతం చేసుకున్నాడు సచిన్‌. ఇప్పటికీ సచిన్‌ సృష్టించిన చాలా రికార్డులను మరే ఆటగాళ్లు అందుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మార్చి 16న సచిన్‌ సాధించిన ఓ రికార్డు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అదే 2012 మార్చి 16న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన 100వ సెంచరీ పూర్తి చేసుకోవడం. ఈ సెంచరీ సచిన్‌కు వన్డేల్లో 49వది కాగా అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. దీంతో సచిన్‌కు బంగ్లాదేశ్‌పై చేసిన సెంచరీ 100 శతకంగా రికార్డుల్లోకెక్కింది. ఇలా 100 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా మాస్టర్‌ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ఈ ఘనత సాధించిన 9 ఏళ్లు గడిచిన సందర్భంగా సచిన్‌కు లెజెండ్స్‌ ప్లేయర్స్‌ యువరాజ్‌, సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌, యూసఫ్‌ పఠాన్‌లతో పాటు మరికొందరు ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సచిన్‌తో ఓ కేక్‌ను కట్‌ చేయించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ప్రగ్యాన్‌ ఓజా ‘రోజు వేరు కావొచ్చు.. కానీ వేడుకలు మాత్రం ఒకటే.. పాజీ 100 సెంచరీలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇదిలా ఉంటే సచిన్‌ ప్రస్తుతం రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు.

ప్రగ్యాన్ ఓజా చేసిన ట్వీట్..

Also Read: IPL 2021: ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్ ఎవరో తేలిపోయింది.. ఈసారి అవకాశం దక్కింది అప్‌స్టాక్స్‌కే..

World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు

ఆ 73.. పురుషులకు.. ఒకటి మహిళకు..ఆమెకే ఎందుకిలా జరుగుతుంది..!?:International Cricketers Video