AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

Central Government Employees: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!
Pension Benefits
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2021 | 6:16 PM

Central Government Employees: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెన్షన్, పెన్షనర్ల విభాగం.. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ బకాయిలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

పదవీ విరమణ చేయబోయే అనేక మంది ఉద్యోగులకు ఇంకా వారి రిటైర్మెంట్ ప్రయోజనాలు లభించలేదని, అన్ని విభాగాలు, సంస్థల అధిపతులు పెన్షన్ బెనిఫిట్స్‌‌కు సంబంధించి పురోగతిని పర్యవేక్షించాలని మంత్రిత్వ శాఖ పేర్కొన్నట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయడానికి సమర్థవంతమైన పర్యవేక్షణా విధానం చాలా అవసరమని కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో.. అతనికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్స్‌ పురోగతిని సమీక్షించవచ్చని.. అలాగే తమ బకాయిల గురించి ఆయా శాఖల ఉద్యోగులు పూర్తిగా తెలుసుకోవాలని నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో పొందే ప్రయోజనాలు అందించడంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు అలసత్వాన్ని ప్రదర్శిస్తే.. తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సిసిఎస్ (పెన్షన్) రూల్స్,1972 చట్టం ప్రకారం ఓ ఉద్యోగికి సంబంధించిన బకాయిలను సకాలంలో క్లియర్ చేయాల్సి ఉంటుందని ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ రూల్స్ ఆధారంగా, ఉద్యోగి పదవీ విరమణ చేయబోయే సంవత్సరానికి ముందే ధృవీకరణ, ఇతరత్రా వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలని నివేదికలో స్పష్టమైంది.

సంబంధిత విభాగాల అధిపతులు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగి ఫారాలను నాలుగు నెలల ముందుగానే పిఏఓకు సమర్పించాల్సి ఉంటుందని, ఆ తర్వాత పీపీఓ జారీ అయి.. ఆ ఫారమ్స్ సీపీఓఓకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా, ఇలా చేయడం ద్వారా పదవీ విరమణ చేయబోయే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని కేంద్ర ప్రజా సంక్షేమ, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!