రెండేళ్లుగా రూ.2వేల నోట్లను ముద్రించడం లేదు.. లోక్‌సభలో కేంద్రం ప్రకటన..
₹2,000 currency notes: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో
₹2,000 currency notes: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టంచేసింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 ఏప్రిల్ నుంచి ఒక్క నోటు కూడా ముద్రించడం లేదని వెల్లడించారు. 2018 మార్చి 30 నాటికి మొత్తం 336.2 మిలియన్ కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
2021 ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 మిలియన్ల కోట్లకు తగ్గిందని ఠాకూర్ పేర్కొన్నారు. సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా.. విలువ పరంగా 17.78 శాతమని ఠాకూర్ వెల్లడించారు. ప్రజల లావాదేవీల డిమాండ్ మేరకు డినామినేషన్ బ్యాంక్ నోట్ల ముద్రణపై… కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
మొత్తంగా 2019-20, 2020-21లలో రూ.2000 నోట్లను ముద్రించలేదని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించినట్లు.. ఆర్బీఐ 2019లో వెల్లడించిన విషయం తెలిసిందే. అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను తగ్గించి, నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. 2016లో నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.2000 నోటును, కొత్త రూ.500 నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Also Read: ‘మీరు త్వరగా కోలుకోవాలి, కానీ, బెంగాల్ సీఎం మమత ‘గాయం’పై హోం మంత్రి అమిత్ షా