Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC- FHRAI: పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్‌సిటిసి-ఎఫ్‌హెచ్ఆర్ఏఐ మధ్య కుదిరిన ఒప్పందం.. టికెట్ బుకింగ్‌తో పాటు హోటల్‌ బుకింగ్ పెసిలిటి కూడా..

IRCTC- FHRAI: పర్యాటకులకు హోటల్ సౌకర్యాలు కల్పించేందుకు గానూ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ ఇ-టికెటింగ్, ఇండియన్..

IRCTC- FHRAI: పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్‌సిటిసి-ఎఫ్‌హెచ్ఆర్ఏఐ మధ్య కుదిరిన ఒప్పందం.. టికెట్ బుకింగ్‌తో పాటు హోటల్‌ బుకింగ్ పెసిలిటి కూడా..
Irctc And Fhrai
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 19, 2021 | 1:33 PM

IRCTC- FHRAI: పర్యాటకులకు హోటల్ సౌకర్యాలు కల్పించేందుకు గానూ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ ఇ-టికెటింగ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి)- ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌హెచ్ఆర్ఐఐ) చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇక నుంచి ఎఫ్‌హెచ్ఆర్ఏఐ హోటల్స్‌తో పాటు, దాని భాగస్వామ్య హోటళ్లలో వసతికి వసతికి సంబంధించి బుక్సింగ్స్‌ని ఐఆర్‌సిటిసి యొక్క పర్యాటక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఒప్పందం కారణంగా ఐఆర్‌సిటిసి ద్వారా హోటళ్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు రాయితీలు కూడా ఇవ్వడం జరుగుతంది. అయితే, ఈ ఆఫర్ వర్తించాలంటే సదరు హోటళ్లు.. ఎఫ్‌హెచ్ఆర్ఏఐ, దాని అనుబంధ హోటల్స్ అయి ఉండాలి.

ఈ భాగస్వామ్యం వల్ల ఐఆర్‌సిటిసి వినియోగదారులు దేశవ్యాప్తంగా 55,000 హోటళ్లలో తమకు నచ్చిన హోటల్‌ను బస చేసేందుకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఎఫ్‌హెచ్ఆర్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్‌బక్షిష్ సింగ్ కోహ్లీ ధృవీకరించారు. ఎఫ్‌హెచ్ఆర్‌ఏఐ హోటళ్లలో ప్రాథమిక సౌకర్యాలతో పాటు.. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఐఆర్‌సిటిసి పోర్టల్ ద్వారా ప్రయాణాన్ని బుక్ చేసుకునేటప్పుడు దేశంలో ఎక్కడైనా నాణ్యమైన గదులను బుక్ చేసుకునే సౌలభ్యం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుందని కోహ్లీ తెలిపారు. ఇక ఈ ఒప్పందం ప్రకారం.. ఐఆర్‌సిసి, ఎఫ్‌హెచ్ఆర్ఏఐల భాగస్వామ్యం మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఒప్పందం కాలం ముగిసిన తరువాత కూడా దానిని పొడించే ఛాన్స్ ఉంది.

ఐఆర్‌సిసిటి-ఎఫ్‌హెచ్ఆర్ఏఐ ల భాగస్వామ్యం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రయత్నం అని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఐ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర కుమార్ జైస్వాల్ అన్నారు. ఈ ఒప్పందం హోటళ్లు, రెస్టారెంట్ల యజమానుల ఇబ్బందులను ఇది తొలగిస్తుందన్నారు. కొన్ని ఓటీఏ లు పర్యాటకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, ప్రస్తుతం జరిగిన ఒప్పందంతో ఆ సమస్య తొలగిపోతుంది అన్నారు. ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు పారదర్శకంగా, ద్వైపాక్షికంగా ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ 19 కారణంగా తీవ్రంగా నష్టపోయిన హోటల్ యజమానుల్లో ఈ ఒప్పందం కొత్త ఆశలు రేకెత్తిస్తోందన్నారు.

Also read:

Corona Cases and Lockdown News LIVE: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 414 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. రూ.48 లక్షలకుపైగా జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు