AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Omni: లక్షా 70వేలకే.. మారుతి ఓమ్ని.. ట్రూ వాల్యూలో బంపర్ ఆఫర్..

Maruti Omni: ఆర్థిక పరమైన పరిస్థితుల కారణంగా.. కారు కొనలేకపోతున్న వారికి దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెబుతోంది. తమ కంపెనీ ద్వారా

Maruti Omni: లక్షా 70వేలకే.. మారుతి ఓమ్ని.. ట్రూ వాల్యూలో బంపర్ ఆఫర్..
Maruti Omni
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Mar 20, 2021 | 11:23 AM

Share

Maruti Omni: ఆర్థిక పరమైన పరిస్థితుల కారణంగా.. కారు కొనలేకపోతున్న వారికి దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెబుతోంది. తమ కంపెనీ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. అది కూడా మంచి మంచి ఆఫర్లతో అందిస్తోంది. దీని ద్వారా మీరు అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. అంటే కేవలం రెండు లక్షలకు తక్కువగానే కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. దీనిలో భాగంగా మారుతి సుజుకి ట్రూ వాల్యూ (Maruti Suzuki true value) ద్వారా సెకెండ్ హ్యాండ్ కార్లను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. వీటిని టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనిలో ఈఎమ్ఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

అయితే ఈ ట్రూ వాల్యూలో 8 సీట్ల వ్యాన్‌ను కేవలం లక్షా 70 వేలకే కొనుగోలు చేసే సదుపాయన్ని కల్పించింది. ఈ 8 సీట్ల ఓమ్ని వ్యాన్ అసలు ధర దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది. అలాంటి ఈ వ్యాన్ ను మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో కేవలం 1,70,000 రూపాయలకే అమ్మకానికి పెట్టింది. ఈ 8 సీట్ల ఓమ్ని మారుతి జెన్యూన్ పార్ట్స్‌తో అందిస్తున్నట్లు పేర్కొంది. దీనిని కొనుగోలు చేసే వారికి చాలా ఫీచర్లను సైతం అందిస్తున్నారు. 2017 మోడల్ అయిన ఓమ్ని.. 70723 కిలోమీటర్ల వరకు నడిచింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెబ్ సైట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాహనానికి ఒక సంవత్సరం వారంటీని సైతం కల్పించనున్నట్లు మారుతి పేర్కొంది. (https://www.marutisuzukitruevalue.com/buy-car/omni-in-rewari-2017/AXdyChIwNiwKO4z0JnMi) కారును చూడాలంటే.. ఈ లింక్ ను క్లిక్ చేయండి..

మారుతి సుజుకి ట్రూ వాల్యూ కింద.. మారుతిలో పలు మోడళ్ల సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో సెకెండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన వివరాలు, ధర, డీలర్ చిరునామా, యజమానుల పేర్లు పొందపరిచి ఉంటారు. మీ మొబైల్ నెంబర్ చిరునామా లాంటివి వెబ్‌సైట్‌లో పొందుపరిచి టస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీకెమైనా కార్లు కావాలంటే.. www.marutisuzukitruevalue.com/buy-car/ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోండి.

Also Read:

Tears of Blood: బహిష్టు సమయంలో ఆ మహిళ కంట రక్తం.. ఆశ్యర్యపోయిన వైద్యులు.. ఎక్కడో తెలుసా..?

Snake: కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. బాటిల్లో పాము పిల్ల దర్శనం.. వీడియో వైరల్