Snake: కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. బాటిల్లో పాము పిల్ల దర్శనం.. వీడియో వైరల్

Drink Bottle: అసలే ఎండాకాలం.. అందరూ ఉపశమనం కోసం శీతలపానీయాలు తాగేస్తుంటారు. అలా తాగే కూల్ డ్రింక్ ప్రియులకు షాకిచ్చే వార్త మనముందుకు వచ్చింది. ఈ వార్త చూస్తే.. హాట్‌ సమ్మర్‌లో హాయిగా

Snake: కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. బాటిల్లో పాము పిల్ల దర్శనం.. వీడియో వైరల్
Snake In Drink Bottle

Drink Bottle: అసలే ఎండాకాలం.. అందరూ ఉపశమనం కోసం శీతలపానీయాలు తాగేస్తుంటారు. అలా తాగే కూల్ డ్రింక్ ప్రియులకు షాకిచ్చే వార్త మనముందుకు వచ్చింది. ఈ వార్త చూస్తే.. హాట్‌ సమ్మర్‌లో హాయిగా కూల్‌డ్రింక్స్‌ తాగేవారు.. జాగ్రత్త పడక తప్పదు మరి. ఇటీవల కాలంలో శీతల పానీయాలకు చెందిన బాటిల్స్‌లో వివిధ రకాల పురుగులు, చిన్న సైజు జంతువుల అవశేషాలు కనపడి ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో థమ్స్‌అప్‌ బాటిల్‌లో పాము ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరులోని ఓ బేకరీలో థమ్స్ అప్ కూల్‌డ్రింక్‌లో మూడు అంగుళాల పాము దర్శనమిచ్చింది. అయితే మూడురోజుల క్రితమే కూల్‌డ్రింక్‌ ఏజెన్సీ ఈ బాటిల్ ను సప్లై చేసినట్లు షాపు యజమాని పేర్కొన్నాడు. షాపులో కూల్‌డ్రింక్స్‌ సర్దుతుండగా, థమ్స్‌ అప్‌ బాటిల్లో పాము కనిపించినట్లు షాపు యజమాని భయంతో వెంటనే సదరు సప్లయార్స్‌కి కంప్లైట్‌ చేసి స్టాక్‌ తిరిగి పంపించాడు. అయితే అమలాపురంలో జరిగిన ఈ సంఘటన ఏపీ మొత్తం వైరల్ అయింది. దీనిపై చాలామంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 

Also Read:

Summer Beauty Tips: ఎండాకాలంలో మీ మేకప్ కోసం ఫౌండేషన్ ఇలా ఎంచుకోండి..

PMJJBY: సామాన్యులకు వరం.. మరింత చౌకగా జీవన్‌జ్యోతి బీమా స్కీం.. వివరాలు