LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

LIC Policy Claim: ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) తమ పాలసీదారులకు శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా క్లెయిమ్‌ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న..

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
Lic Policy
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Mar 20, 2021 | 11:40 AM

LIC Policy Claim: ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) తమ పాలసీదారులకు శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా క్లెయిమ్‌ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది. మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్‌ఐసీ కార్యాలయాల్లో క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవకాశం కేవలం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ క్లాయిమ్‌ కోసం ఆయా పాలసీదారులు తమ సమీప ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించి తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. పాలసీదారుడు తన సర్వీసింగ్‌ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఏ సమీప బ్రాంచ్‌ నుంచైనా మెచ్యూరిటీ క్లాయిమ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఎల్‌ఐసీకి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 112 డివిజన్‌ కార్యాలయాలు, 2,048 బ్రాంచులు, 1,526 శాటిలైట్‌ కార్యాయాలు, 741 కస్టమర్‌ జోన్లలో ఈ సేవలు పొందవచ్చని స్పష్టం చేసింది.

అయితే పాలసీదారుడు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా.. క్లెయిమ్‌ చెల్లింపును మాత్రం సంబంధిత సర్వీసింగ్‌ బ్రాంచ్‌ మాత్రమే ప్రాసెస్‌ చేస్తుందని తెలిపింది. మొదట పాలసీదారుడు అందజేసిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత సర్వీసింగ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తుంది. ఈ క్లెయిమ్‌ కు సంబంధించి ప్రక్రియ సులభతరం చేయడానికి సంబంధిత అధికారులకు ప్రత్యేక అధికారం ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. పాలసీదారుడు సర్వీసింగ్‌ బ్రాంచ్‌ ఒక నగరంలో ఉండి అతను ఇతర నగరంలో ఉన్నా.. పాలసీ క్లెయిమ్‌ కోసం సమీపంలో ఉన్న బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

బచత్​ ప్లస్​ ప్లాన్ పేరిట కొత్త పాలసీ

కాగా, ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకువస్తున్న ఎల్‌ఐసీ తాజాగా బచత్‌ ప్లస్‌ పేరిట కొత్త పాలసీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. పాలసీదారుడికి బీమా రక్షణతో పాటు పొదుపు కోసం దీనిని రూపొందించింది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌లో చేరినట్లయితే పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది. పాలసీ అమల్లో ఉన్న ఐదేళ్లలో మరణిస్తే నిబంధనల ప్రకారం ఒకేసారి పాలసీ విలువను చెల్లిస్తారు. ఆ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి పరిహారంతో పాటు లాయల్టీని కలిపి అందజేస్తారు. ఈ ప్లాన్‌లో చేరిన పాలసీదారుడు సింగిల్‌ ప్రీమియం విధానంలో ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదా ఐదు సంవత్సరాల పాటు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. పాలసీదారుడు 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీని ఎల్ఐసీ అధికారి వెబ్‌సైట్‌ లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా చేసుకోవచ్చని ఎల్‌ఐసీ సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం ఎల్‌ఐసీ దేశ వ్యాప్తంగా 29 కోట్లకుపైగా పాలసీలను అందిస్తోంది. ఎల్‌ఐసీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా పాలసీలను అందిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు